BigTV English

Zubeen Garg: స్టార్ సింగర్ మృతి.. మ్యూజీషియన్ అరెస్ట్.. మరణంపై ఎన్నో అనుమానాలు!

Zubeen Garg: స్టార్ సింగర్ మృతి.. మ్యూజీషియన్ అరెస్ట్.. మరణంపై ఎన్నో అనుమానాలు!

Zubeen Garg:ప్రముఖ అస్సామీ స్టార్ సింగర్ జుబీన్ గార్గ్ (Zubeen Garg) ఇటీవల సింగపూర్లో అనూహ్యంగా సముద్రంలో పడి చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందని అందరూ అనుకున్నారు. కానీ ఈయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే అస్సాం ప్రభుత్వం జుబీన్ మరణంపై అనుమానాలు వ్యక్తం కావడంతో 10 మందితో సిట్ ఏర్పాటు చేసింది.


సింగర్ మృతి.. మ్యూజిషియన్ గోస్వామి అరెస్ట్..

విచారణలో భాగంగా సింగర్ మేనేజర్ సిద్ధార్థ్ ఇంట్లో సిట్ దాడులు చేసిన రోజే.. మ్యూజిషియన్ ను అరెస్ట్ చేసినట్లు జాతీయ మీడియా స్పష్టం చేసింది. ముఖ్యంగా జుబీన్ గార్గ్ మృతి కేసులో మ్యూజిషియన్ శేఖర్ జ్యోతి గోస్వామిని అరెస్టు చేయడానికి కారణం జుబీన్ తో పాటు గోస్వామి కూడా ఘటన జరిగిన రోజు అదే బోటులో ప్రయాణించినట్లు సమాచారం. ఈ కేసులో గోస్వామిని విచారించనున్నారు. అయితే ఈ అరెస్ట్ విషయాన్ని అధికారులు కూడా ధ్రువీకరించడం జరిగింది

మృతికి కారణమైన వారిని వదిలేది లేదు – అస్సాం సీఎం


సింగర్ మృతికి కారణమైన వారిని వదిలేది లేదు అంటూ అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. ఈ అంశంపై ఆయన..” పోలీస్ డిపార్ట్మెంట్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యాను. దీనిపై సిట్ ను కూడా ఏర్పాటు చేయాలని బిజెపికి ఆదేశాలు పంపించాము. ఈ కేసు విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాను” అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు.

అంత్యక్రియలలో కూడా రికార్డు సృష్టించిన జుబీన్ గార్గ్..

ఇక జుబీన్ ఈనెల 19వ తేదీన సింగపూర్ కి వెళ్లి అక్కడ క్రీడల్లో (స్కూబా డైవింగ్) భాగంగా సముద్రంలో పడి మరణించారు. 52 సంవత్సరాల జుబీన్ అంతిమ యాత్ర అరుదైన రికార్డును సృష్టించింది.. గార్గ్ అంత్యక్రియలు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకున్నాయి. అస్సాం రాజధాని గువహటి లో నిర్వహించిన జుబీన్ గార్గ్ అంతిమయాత్రకు లక్షలాదిమంది అభిమానులు తరలివచ్చి ఆయన పాడిన పాటలను పాడుకుంటూ నివాళులు అర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను ముగించారు. ఇకపోతే మైకేల్ జాక్సన్, పోప్ ఫ్రాన్సిస్, క్వీన్ ఎలిజిబెత్ 2 అంతిమయాత్రల తర్వాత జుబీన్ అంతిమయాత్రకు అత్యధికమంది ప్రజలు వచ్చి రికార్డు సృష్టించారు.

జుబీన్ గార్గ్ కెరియర్..

ఈయన కెరియర్ విషయానికి వస్తే.. అస్సామీతో పాటు బెంగాలీ, హిందీ భాషల్లో గాయకుడిగా, స్వరకర్తగా మంచి పేరు సంపాదించుకున్నారు. 2006లో హిందీ చిత్రం గ్యాంగ్ స్టార్ లో ఆయన ఆలపించిన “ఏ ఆలీ” అనే పాట దేశవ్యాప్తంగా సంగీత ప్రియులను ఆకట్టుకుంది. క్రిష్ 3 , ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్ వంటి చిత్రాలలో ఆయన పాడిన పాటలకు కూడా మంచి పేరు లభించింది. మొత్తం 40 భాషల్లో వివిధ యాసలలో పాటలు పాడి అత్యంత ప్రతిభావంతుడిగా పేరు దక్కించుకున్నారు.

ALSO READ:Avatar 3 Trailer: అవతార్ 3 కొత్త ట్రైలర్ రిలీజ్.. జేమ్స్ ఇండియాకి వచ్చారా?

Related News

OG Movie: సీక్వెల్ కాదు ప్రీక్వెల్.. అసలు ట్విస్ట్ ఏంటంటే?

Big Breaking: ప్రముఖ డైరెక్టర్ తల్లి మృతి.. ఎలా జరిగిందంటే?

Avatar 3 Trailer: అవతార్ 3 కొత్త ట్రైలర్ రిలీజ్.. జేమ్స్ ఇండియాకి వచ్చారా?

Chiranjeevi Vs Balakrishna: మరోసారి బయటపడ్డ మెగా నందమూరి విభేదాలు.. అసలు గొడవ అక్కడేనా?

OG Title: OG.. టైటిల్ ని ఆ నిర్మాత గిఫ్ట్ ఇచ్చారు.. అసలు నిజం చెప్పేసిన దానయ్య

OG Film: పవన్ అభిమానులకు బిగ్ షాక్… హెచ్డీ ప్రింట్ లీక్!

Pawan Kalyan: ఓజీ చూడాలంటే ఇది తప్పనిసరి… పవన్ ఫ్యాన్స్ కి ప్రసాద్ మల్టీప్లెక్స్ కండిషన్

Big Stories

×