India vs Pakistan final: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ దశకు… వచ్చేసింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో అందరూ ఊహించినట్లుగానే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైట్ జరగనుంది. సెప్టెంబర్ 28వ తేదీన అంటే ఎల్లుండి ఆదివారం రోజున… టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. నిన్నటి రోజున…. బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో చివరి వరకు పోరాడిన పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇందులో పాకిస్తాన్ విజయం సాధించడంతో…. ఆసియా కప్ ఫైనల్ బరిలో నిలిచింది. దీంతో 41 సంవత్సరాల ఆసియా కప్ చరిత్రలో తొలిసారి టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అందరి కళ్ళు ఈ ఫైనల్ మ్యాచ్ పైన పడ్డాయి.
ఆసియా కప్ ఫైనల్ 2025 టోర్నమెంట్ పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల సమయంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు దుబాయ్ స్టేడియాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తున్నారు. అయితే ఫైనల్ మ్యాచ్ కంటే ముందు ఇవాళ శ్రీలంకతో టీమిండియా కు మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ కూడా దుబాయ్ వేదికగా జరగనుంది. ఫైనల్ కంటే ముందు శ్రీలంకతో టీమిండియా మ్యాచ్ ఆడడం చాలా ప్లస్ అవుతుంది. ఈ మ్యాచ్ ఆడిన తర్వాత ఒకరోజు రెస్ట్ తీసుకొని ఫైనల్ మ్యాచ్ ఆడెందుకు టీమిండియా సన్నద్ధమవుతోంది. ఈ మ్యాచ్ లను సోనీ లీవ్ లో చూడవచ్చును. అందులో సబ్ స్క్రిప్షన్ చేసుకుంటేనే ఉచితంగా మ్యాచ్ లు తిలకించవచ్చును.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో… రికార్డులు పాకిస్థాన్ ను వణికిస్తున్నాయి. ఇప్పటి వరకు టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య 15 టీ20 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో టీమిండియానే పై చేయి సాధించింది. ఏకంగా 12 మ్యాచ్ లలో పాకిస్థాన్ జట్టును చిత్తు చేసింది టీమిండియా. ఇందులో పాకిస్థాన్ కేవలం 3 మ్యాచ్ లలో మాత్రమే గెలిచింది. అంతేకాదు.. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో గ్రూప్ స్టేజ్ లో ఒకసారి, సూపర్ 4 లో మరోసారి టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఫైట్ జరిగింది. ఇందులో రెండు మ్యాచ్ లలోనూ టీమిండియా విజయం సాధించింది. ఈ లెక్క ప్రకారం… ఆసియా కప్ ఫైనల్ లో టీమిండియా గెలుస్తుందని అంటున్నారు.
Also Read: Team India : వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక..వైస్ కెప్టెన్ గా జడేజా..షెడ్యూల్ ఇదే
?igsh=MW5udjE5anByZWx0