E-Paper
Advertisement

తొడలు కొట్టడం, ఛాలెంజ్‌లు చేయడం.. ఈవెంట్లకు వెళ్లాలంటేనే భయమేస్తోంది.. బోయపాటి శ్రీను!

తొడలు కొట్టడం, ఛాలెంజ్‌లు చేయడం.. ఈవెంట్లకు వెళ్లాలంటేనే భయమేస్తోంది.. బోయపాటి శ్రీను!
Advertisement

Boyapati Srinu:బోయపాటి శ్రీను..ఈయన పేరు చెప్పగానే ఎన్నో పవర్ ఫుల్ సీన్స్ అంతకి మించి ఎన్నో పవర్ ఫుల్ డైలాగ్స్ కళ్ళ ముందు వినిపిస్తాయి.అలాంటి బోయపాటి శ్రీను తాజాగా నీరో సినిమా ఫస్ట్ స్పార్క్ లాంచ్ ఈవెంట్‌లో చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బోయపాటి మాట్లాడుతూ మీడియా వాళ్లందరికీ స్పెషల్‌గా థ్యాంక్స్ అని చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా, ప్రతి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడంలో మీడియా కీరోల్ పోషిస్తుందని అన్నారు.

Advertisement

అయితే ఈ మధ్య గ్లింప్స్, టీజర్ లాంచ్ ఈవెంట్లకు వెళ్లాలంటేనే కొంచెం భయంగా ఉంటోందని సరదాగా కామెంట్ చేసుకొచ్చారు. ఎందుకంటే కొంతమంది స్టేజ్ ఎక్కి ఎమోషన్‌లో ఏది పడితే అది మాట్లాడేస్తున్నారని, తొడలు కొట్టడం, సినిమా ఆడకపోతే అంటూ రకరకాల ఛాలెంజ్‌లు చేస్తున్నారని ఫన్నీ గా చెప్పుకొచ్చారు.

వాళ్లు ఆ మాటలు నిజంగా కాన్ఫిడెన్స్‌తో అంటున్నారో లేక ఎమోషన్‌లో ఊగిపోయి అంటున్నారో అర్థం కావడం లేదని, కానీ కింద కూర్చున్న తమకు మాత్రం గడగడ వణుకు పుడుతోందని నవ్వుతూ అన్నారు. మంచి సినిమా తీశామనే నమ్మకం ఉండటం వేరు, కానీ దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇలా స్టేజ్ మీద ఛాలెంజ్‌లు చేయడం వేరని తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టేశాడు ఈ మాస్ డైరెక్టర్ .

Advertisement

అయితే మనం మనల్ని మనమే కామెడీ చేసుకోకూడదని, సినిమా గురించి వేదికల మీద ఎంత గొప్పగా మాట్లాడామన్నది ముఖ్యం కాదని అన్నారు. మనం మాట్లాడటం కంటే మన సినిమా మాట్లాడాలని తేల్చి చెప్పారు.ఈ ఈవెంట్‌కు రావడానికి అసలు కారణం దర్శకుడు కళ్యాణ్ చక్రవర్తి అని చెప్పారు బోయపాటి.

తనతో ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేసిన వ్యక్తి ఇప్పుడు డైరెక్టర్‌గా మారడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కళ్యాణ్ కేవలం పాటలు రాసే రచయిత మాత్రమే కాదని, తన సినిమాల స్టోరీ డిస్కషన్స్ లలో కూడా పార్టిసిపేట్ చేసేవాడని గుర్తు చేసుకున్నారు.

అలా చాలామంది దర్శకుల దగ్గర పనిచేసి అనుభవం సంపాదించుకున్న ఆయన, ఇప్పుడు డైరెక్టర్‌గా కొత్త ప్రయాణం మొదలుపెట్టడం ఆనందంగా ఉందని తెలిపారు.ఇక ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్‌తో ‘లెజెండ్’ సినిమా టైమ్ నుంచి తన జర్నీ కంటిన్యు అవుతుందని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో కూడా ఎన్నో సినిమాలకు కలిసి పనిచేశామని తెలిపారు. ఇక తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి తెలిసిన శేఖర్ ఇప్పుడు మంచి ఆర్ట్ డైరెక్టర్‌గా ఎదగడం సంతోషంగా ఉందన్నారు.

ఈ టీమ్‌లో ఉన్న వాళ్లందరూ తనకు తెలిసినవాళ్లే అయినా, ఇక్కడ నా టీమ్, వేరే టీమ్ అనే తేడా ఏమీ లేదని చెప్పారు. మొత్తం ఇండస్ట్రీ అంతా ఒకే టీమ్ అని బోయపాటి చెప్పడం ఇక్కడ విశేషం.

చివరగా, ఒక దర్శకుడు సినిమా తీసేటప్పుడు తనకు ఏం కావాలో క్లారిటీ ఉండాలని, తాను నమ్మిన కథను ధైర్యంగా తెరపైకి తీసుకురావాలని అప్పుడే దర్శకుడిగా ఒక మంచి గుర్తింపు వస్తుందని చెప్పుకొచ్చారు ఈ క్రేజీ ఫిలిమ్ మేకర్ !

also read:థియేటర్‌కు వెళ్లాక సీన్లు తీసేస్తే మా పరువు పోయినట్టే.. సీనియర్ ఎడిటర్ వైరల్ కామెంట్స్!

Tags

Related News

బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘దాదా’ రిలీజ్ డేట్‌పై ఫుల్ క్లారిటీ!

థియేటర్‌కు వెళ్లాక సీన్లు తీసేస్తే మా పరువు పోయినట్టే.. సీనియర్ ఎడిటర్ వైరల్ కామెంట్స్!

IFFI 2026 రెడ్ కార్పెట్‌పై కేథరిన్ ట్రెసా మెరుపులు.. ఈ క్లాసీ లుక్ చూశారా?

1200 సినిమాలు.. 50 ఏళ్ల ప్రయాణం.. నాన్న కష్టాల గురించి బయటపెట్టిన జీవా కొడుకు!

కార్తీకదీపం సీరియల్ నటుడు “ఓ టార్చర్ ప్రేమ” సినిమా టీజర్ లాంఛ్

క్రిస్మస్‌కు ముందే హీట్ పెంచిన సాయి మంజ్రేకర్.. గ్రీన్ డ్రెస్‌లో అదిరిపోయే అందాలు!

అవకాశాలు వస్తున్న రిజెక్ట్ చేస్తున్న సుధాకర్.. అసలు కారణం బయట పెట్టిన కొడుకు!

Big Stories

Advertisement
×