BigTV English

Gold:- 10గ్రా. బంగారం 70వేలు… వచ్చే అక్షయ తృతీయ నాటికి కన్ఫార్మ్

Gold:- 10గ్రా. బంగారం 70వేలు… వచ్చే అక్షయ తృతీయ నాటికి కన్ఫార్మ్

Gold:- అనలిస్టుల అంచనా ప్రకారమే… ఈ అక్షయ తృతీయకు పది గ్రాముల బంగారం ధర 60వేలు దాటింది. ఇప్పుడు వచ్చే అక్షయ తృతీయకు ఎంత వరకు పెరుగుతుందన్న అంచనాలు రెడీ చేశారు. దాని ప్రకారం… వచ్చే ఏడాది పది గ్రాముల బంగారం ధర 70వేల రూపాయలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే.. అలాగే ఉంది కూడా.


ప్రపంచం బాగుంటేనే బంగారం ధర తగ్గుతుంది. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బాగోలేదు. అమెరికా సహా యూరప్ దేశాలు రెసిషన్ లోకి వెళ్తున్నాయి. ఈ ఆర్థిక మాంద్యం నుంచి బయటపడడానికి ఈజీగా ఏడాది పడుతుంది. అంటే, అప్పటి వరకు బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి.

పైగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లు పెంచుతోంది. సో, ఇన్వెస్టర్లు సేఫ్ ఇన్వెస్ట్ మెంట్ కింద బంగారాన్నే చూస్తారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. బ్యాంకింగ్ సంక్షోభం పొంచే ఉంది. యుద్ధ భయాలు, టెన్షన్లు తగ్గలేదు. సో, ఈ పరిస్థితులన్నీ చక్కబడాలంటే.. మరో ఏడాది కంపల్సరీ. ఈ ఏడాది వరకు పెట్టుబడిదారులు ఆలోచించేది బంగారం గురించే. పైగా ఈమధ్య డిజిటల్ గోల్డ్ లోకి పెట్టుబడులు పెరుగుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే.. బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది.


బంగారం ధర పెరుగుతుంది సరే… కొంటారా. మొన్న అక్షయ తృతీయ వెలవెలబోయింది. హైద‌రాబాద్‌లో ప‌ది గ్రాముల బంగారం 61,040, చెన్నైలో అత్య‌ధికంగా 61,530 ప‌లికింది. సో, ధర భారీగా ఉండడంతో పెద్దగా కొనుగోళ్లు జరగలేదని బులియన్ మార్కెట్ ఎక్ప్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇప్పుడు బంగారం ధర 70వేలు దాటితే… ఇక సామాన్యుడికి బంగారం దూరం అయినట్టే. అప్పుడిక పేపర్ గోల్డ్ తీసుకోవడం, డిజిటల్ గోల్డ్ కొనుక్కోవడం తప్ప… బంగారం షాపులకు వెళ్లి గోల్డ్ కొనుక్కోవడం ఉండదంటున్నారు. ఏదేమైనా బంగారం ధర 50వేలు క్రాస్ చేసి, 60వేలు దాటి 70వేల దిశగా వెళ్లోంది. వచ్చే రోజుల్లో 70 వేలు రీచ్ అవడం మాత్రం ఖాయమే. 

Related News

Trump Tariff: ఇండియాకు మరో ఝలక్.. ఫార్మాపై ట్రంప్ పిడుగు.. 100% టారిఫ్..

UP CM Yogi: సీఎంని పాతిపెట్టేస్తాం.. ముస్లిం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Steel Spoons In Stomach: కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్ లు..అలా ఎలా మింగేశావ్ భయ్యా!

Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్

BSNL 4G Network: రేపటి నుంచే దేశంలో 4జీ సేవలు ప్రారంభం.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

MiG-21: ముగియనున్న మిగ్-21.. 62 ఏళ్ల సేవకు ఘన వీడ్కోలు

Naxal Couple Arrested: రాయ్‌పూర్‌లో మావోయిస్టు జంట అరెస్ట్..

Big Stories

×