Big Stories

Post Office:- పెట్టుబడి పెట్టడం ఓకే… ముగించడం ఎలా.. పోస్టాఫీస్ రూల్స్ ఏంటి?

- Advertisement -

Post Office:- ఓ కాలపరిమితికి అనుగుణంగా పెట్టుబడి పెట్టి… మధ్యలో అర్ధంతరంగా తీసేయాల్సి వస్తే ఎలా. కచ్చితంగా ఆలోచించాల్సిన అంశం ఇది. సపోజ్.. మ్యూచువల్ ఫండ్స్ లో లాకిన్ పిరియడ్ మూడేళ్లు. అంటే, కచ్చితంగా మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసి ఉంచాలి. అప్పుడే, వాటిపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు. అంటే, మూలధన పెట్టుబడిపై పన్ను వేయరు. అలా కాదని పెట్టిన పెట్టుబడిని మూడేళ్లలోపే తీసేస్తే.. కచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సరిగ్గా ఇదే ఫార్ములా పోస్టాఫీస్ పథకాలకు కూడా వర్తిస్తుంది. ఓ టైం పిరియడ్ వరకు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి.. అందులో పెట్టుబడి పెట్టిన తరువాత.. మన అవసరాలకు డబ్బు వెనక్కి తీసేసుకుంటామంటే పోస్టాఫీసులు కొన్ని ఛార్జెస్ విధిస్తాయి. అలాంటి వాటిని పెట్టుబడి పెట్టే ముందే తెలుసుకోవడం అవసరం.

- Advertisement -

మొదటిది పోస్టాఫీసు సేవింగ్స్‌ ఖాతా. ఈ అకౌంట్‌పై ఏడాదికి 4 శాతం వడ్డీ చెల్లిస్తారు. ఈ అకౌంట్‌ను ఎప్పుడైనా మూసి వేయొచ్చు. అందులో ఉన్న బ్యాలెన్స్ అమౌంట్‌ను విత్ డ్రా చేసుకోవచ్చు.

రెండోది రికరింగ్‌ డిపాజిట్‌. ఈ స్కీమ్‌లో పెట్టిన అమౌంట్‌ను మధ్యలోనే వెనక్కి తీసేసుకుంటే.. సేవింగ్స్ అకౌంట్ వడ్డీ మాత్రమే చెల్లిస్తారు తప్ప.. రికరింగ్ డిపాజిట్‌కు తగ్గ వడ్డీ ఇవ్వరు.

మూడోది నేషనల్‌ సేవింగ్స్‌ టైమ్‌ డిపాజిట్‌ అకౌంట్. ఈ పథకంలో డిపాజిట్‌ చేసిన తేదీ నుంచి 6 నెలల ముందు వరకు అకౌంట్ క్లోజ్ చేయడం కుదరదు. 6 నెలల తర్వాత గానీ, ఒక సంవత్సరం ముందు గానీ రద్దు చేస్తే.. పోస్టల్‌ సేవింగ్స్‌ అకౌంట్ వడ్డీ రేటు మాత్రమే ఇస్తారు. అదే ఒక ఏడాది తర్వాత.. అకౌంట్‌ను ముందుగానే క్యాన్సిల్ చేస్తే పూర్తయిన సంవత్సరాలకు వడ్డీ రేటు కంటే 2 శాతం తక్కువ వడ్డీ ఇస్తారు.

నాలుగోది మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అకౌంట్. డిపాజిట్‌ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం లోపు డిపాజిట్‌ను విత్ డ్రా చేయడం కుదరదు. ఏడాది తర్వాత అకౌంట్ మూసేస్తే.. వచ్చే వడ్డీ నుంచి 2 శాతం మినహాయిస్తారు. అకౌంట్‌ను 3 సంవత్సరాల తర్వాత గానీ, 5 సంవత్సరాల ముందు గానీ మూసివేస్తే.. వచ్చే వడ్డీ నుంచి 1 శాతం మినహాయిస్తారు.

ఐదోది సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ అకౌంట్. ఈ అకౌంట్ ను తెరిచిన తేదీ తర్వాత ఎప్పుడైనా ముందుగానే మూసివేయొచ్చు. కాకపోతే, ఒక సంవత్సరానికి ముందే అకౌంట్ మూసివేస్తే వడ్డీ ఇవ్వనే. ఒకవేళ అప్పటికే వడ్డీ చెల్లించినట్లయితే, అసలు మొత్తం నుంచి మినహాయించుకుంటారు. ఖాతాను ఒక సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల లోపు మూసివేస్తే.. అసలు మొత్తం నుంచి 1.5 శాతం మినహాయించుకుంటారు. 2 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల లోపు మూసివేస్తే.. అసలు మొత్తం నుంచి 1 శాతం మినహాయించుకుంటారు.

ఆరోది పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌. 5వ సంవత్సరం పూర్తయిన త‌ర్వాత.. అకౌంట్ హోల్డరే కాకుండా జీవిత భాగ‌స్వామి, పిల్లలు, త‌ల్లిదండ్రులకు ఏదైనా ప్రాణాంత‌క వ్యాధి ఉన్నట్టు నిర్ధార‌ణ అయినా, మరేదైనా అవసరానికో డాక్యుమెంట్స్ చూపించి మెచ్యూరిటీకి ముందే పీపీఎఫ్‌లో ఉన్న డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. కాకపోతే ఒక శాతం వడ్డీ మినహాయించుకుంటారు.

ఏడోది సుకన్య సమృద్ధి పథకం. అకౌంట్ హోల్డర్ దురదృష్టవశాత్తు చనిపోతే డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా ఉపసంహరించుకోవచ్చు. కాకపోతే, సేవింగ్స్‌ అకౌంట్ వడ్డీ మాత్రమే ఇస్తారు. లేదా ఏదైనా ఆర్థిక సమస్యలు, ఇతర సమస్యలు ఏర్పడినప్పుడు 5 సంవత్సరాల తర్వాత కూడా అకౌంట్ మూసేయొచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News