BSNL 4G Network: రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఓ ముఖ్యమైన కార్యక్రమం ప్రారంభించనున్నారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ప్రభుత్వం టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4 జీ సేవలు రేపటి నుంచి దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నట్టు చెప్పారు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నారు. రేపటినుంచే ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇది క్లౌడ్ ఆధారిత నెట్ వర్క్ గా పని చేస్తుందని.. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు 5జీకి సులభంగా అప్ గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుందని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు.
On the occasion of BSNL's 25th anniversary, PM @narendramodi will unveil two significant initiatives: the nationwide rollout of BSNL’s indigenously developed 4G stack across 98,000 sites and the launch of India’s 100% 4G saturation network through Digital Bharat Nidhi.… https://t.co/3zwdxub2L9
— DD News (@DDNewslive) September 26, 2025
రేపటి నుంచి దేశ వ్యాప్తంగా దాదాపు 98 వేల సైట్లలో అందుబాటులోకి తేనున్నట్టు మంత్రి వివరించారు. పలు రాష్ట్రాల్లో ఒకేసారి ఈ కార్యక్రమం ప్రారంభం కానుందని వివరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ సేవలను ఒడిశా రాష్ట్రంలోని జూర్సుగుడా నుంచి ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. అస్సాం రాజధాని నగరం గువాహటిలో జరిగే కార్యక్రమంలో మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పాల్గొననున్నారు.
ALSO READ: AP Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏ ఏ జిల్లాలకు ఎక్కువ ఎఫెక్ట్ అంటే?
భారత్ ప్రస్తుతం టెలికాం పరికరాల ఉత్పత్తి, తయారీలో అగ్రదేశాల సరసన చేరిందని మంత్రి చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు డెన్మార్క్, స్వీడర్, సౌత్ కొరియా, చైనా మాత్రమే ఈ రంగంలో ఉండగా తాజాగా ఈ దేశాల సరసన భారత్ చేరిందని వివరించారు. భారత్ ఐదో దేశంగా నిలిచిందని వివరించారు. అలాగే.. డిజిటల్ భారత్ నిధి కార్యక్రమంలో భాగంగా 100 శాతం 4జీ సాచురేషన్ ప్రాజెక్టును కూడా ఆవిష్కరించనున్నారు. 4జీ సాచురేషన్ ప్రాజెక్ట్ కింద మొత్తం 29వేల నుంచి 30వేల గ్రామాల్లో టెలికాం సేవలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు.
ALSO READ: TG Dasara Holidays: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కాలేజీలకు దసరా సెలవులు, ఎప్పటినుంచంటే?
బీఎస్‌ఎన్‌ఎల్ భవిష్యత్ వృద్ధి కోసం, సైట్‌ల విస్తరణ, ఆధునికీకరణ కోసం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ప్లాన్ సిద్ధంగా ఉందని, దీనికి ఫ్రీ క్యాష్ ఫ్లోలు, మానిటైజేషన్ కేంద్ర ప్రభుత్వ మద్దతు నుండి నిధులు సమకూరుతాయని మంత్రి తెలిపారు. టారిఫ్‌లపై అడిగిన ప్రశ్నలకు సమాధానంగా… భారత్‌లో టెలికాం సేవలు ప్రపంచంలో అత్యంత చౌకగా ఉన్నాయని, డేటా ధర గిగాబైట్‌కు 11 సెంట్లు మాత్రమేనని, ప్రపంచ సగటు $2.49తో పోలిస్తే ఇది చాలా తక్కువని ఆయన అన్నారు. ధరల నిర్ణయం ఆయా కంపెనీల అధికార పరిధిలో ఉంటుందని, నియంత్రణ అవసరం లేదని ఆయన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు.