E-Paper
Advertisement

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. టెంపోను ఢీ కొట్టిన బస్సు-12 మంది మృతి

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. టెంపోను ఢీ కొట్టిన బస్సు-12 మంది మృతి
Advertisement

Rajasthan Road Accident: రాజస్థాన్‌లోని ధోల్ పుర్ జిల్లాలో తెల్లవారుజామున విషాద ఘటన చోటు చేసుకుంది. టెంపోను స్లీపర్ బస్సు ఢీకొని 12 మంది మృతి చెందారు. మరికొంత మందికి తీవ్రగాయాలు అయ్యాయి. కరీం కాలనీకి చెందిన నహ్నూ, జమీర్ కుటుంబ సభ్యులతో కలిసి.. బరౌలీ అనే ప్రాంతంలో వివాహ వేడుకకు వెళ్లారు. కార్యక్రమం అనంతరం తిరిగి టెంపోలో ప్రయాణిస్తుండగా.. ఎదురుగా అతివేగంగా వస్తున్న స్లీపర్ బస్సు ఢీకొట్టింది.

ఈ ప్రమాదాన్ని గమనించిన  స్ఠానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహటినా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది మృతి చెందగా.. ఇందులో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయ పడన వారిలో బస్సు డ్రైవర్ తో పాటు క్లీనర్ ఉన్నట్లు పోలీసులు వెళ్లడించారు.

Advertisement

Also Read:  ఢిల్లీలో బాంబు పేలుడు.. సిఆర్‌పిఎఫ్ స్కూల్ వద్ద ఘటన!

కాగా, మృతి చెందిన వారిని పోస్టుమార్టానికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అడిషనల్ కమల్ కుమార్ జాంగీద్, సబ్ కలెక్టర్ దుర్గా ప్రసాద్ మీనా తదితర అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

Big Stories

Advertisement
×