BigTV English

Bigg Boss 8 Day 49 Promo 1: చిత్రం భళారే విచిత్రం.. మరో కొత్త టాస్క్ తో..!

Bigg Boss 8 Day 49 Promo 1: చిత్రం భళారే విచిత్రం.. మరో కొత్త టాస్క్ తో..!

Bigg Boss 8 Day 49 Promo 1.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss);గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్ లను దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఒక ఓటీటీ సీజన్ ను కూడా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఎనిమిదవ సీజన్ మొదలైంది. ఎనిమిదో సీజన్లో భాగంగా ఏడవ వారం చివరి దశకు కూడా చేరుకుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో 2024 సెప్టెంబర్ 1 న చాలా గ్రాండ్ గా ప్రారంభమైన ఈ షో, ఇప్పుడు ఏడవ వారం చివరి దశకు చేరుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో అసలైన రచ్చ..

ఇకపోతే ఇందులో 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా.. అందులో ఏడు మంది ఆరువారాలలో ఎలిమినేట్ అయ్యారు. ఇక ఏడవ వారం కన్నడ నటుడు పృథ్వి రాజ్ ఎలిమినేట్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను ఎనిమిది మందిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి తీసుకొచ్చారు. ఇలా ఇప్పుడు అందరిని ఒకచోట చేర్చి అభిమానులకు మంచి వినోదాన్ని పంచుతున్నారు. ఇదిలా ఉండగా ఏడవ వారం చివరి దశకు చేరుకోవడంతో.. సండే ఫన్ డేలో భాగంగా 49వ రోజుకు సంబంధించి ప్రోమో విడుదల చేశారు మేకర్స్.


49వ రోజు ఎపిసోడ్ ప్రోమో..

ప్రోమో విషయానికి వస్తే చిత్రం భళారే విచిత్రం.. అంటూ ఒక టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్. అందులో భాగంగానే హోస్ట్ నాగార్జున అమ్మాయిలను ఒక గ్రూప్ గా, అబ్బాయిలను ఇంకొక గ్రూప్ గా చేర్చి.. ఒక చీటీని ఇచ్చి అందులో ఏముందో బొమ్మల రూపంలో గీస్తే దానిని మిగతావారు ఐడెంటిఫై చేయాలి. ఇలా ఒక టాస్క్ నిర్వహించారు.ఈ టాస్క్ ఆద్యంతం నవ్వులు కురిపించింది. టాస్క్ విషయానికి వస్తే.. చిత్రం భళారే విచిత్రం టాస్క్ లో భాగంగా.. అవినాష్ టైటానిక్ పేరు తీసి బొమ్మ గీసే ప్రయత్నం చేశారు. కాస్త బొమ్మ గీయడానికి కష్టపడగా.. వెంటనే టేస్టీ తేజ సంక్రాంతి అనగా, మరొకరు గాలిపటం అంటూ రకరకాల కామెంట్లు చేశారు కానీ నిఖిల్ వెంటనే టైటానిక్ అంటూ చెప్పి అవినాష్ కి కాస్త ఊరట ఇచ్చి ఒక మార్క్ కొట్టేశారు. ఆ తర్వాత బాహుబలి అంటూ ప్రేరణ బొమ్మ గీసే ప్రయత్నం చేసింది. అందులో నీటి అలలు వేసి ఒక మనిషి బొమ్మ గీసి, తర్వాత చేతిలో బిడ్డ ఉన్నట్టు బొమ్మ గీయగా వెంటనే అమ్మాయిలు బాహుబలి అంటూ కామెంట్ చేశారు. ఇకపోతే ప్రేరణ బాహుబలి బొమ్మ గీయగా దానిని అర్థం చేసుకొని అమ్మాయిలు దానిని బాహుబలి అంటూ ఐడెంటిఫై చేయడం నిజంగా గ్రేట్ అంటూ అమ్మాయిలను పొగిడేసాడు నాగార్జున. ఆ తర్వాత గౌతమ్ కి జెంటిల్మెన్ రాగా ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ అబ్బాయిలు మాత్రం చెప్పలేకపోయారు. విష్ణు ప్రియకి సింగం రాగా బొమ్మ గీసే ప్రయత్నాలు చేసినా ఆమె వల్ల కాలేదు కానీ తన ప్రయత్నంతో రోహిణి సింగం అంటూ చెప్పి మార్కు సంపాదించింది. మొత్తానికైతే ఈ ప్రోమో కాస్త హిలేరియస్ గా ఉందని చెప్పవచ్చు.

https://fb.watch/vklZEW1CEP/

Related News

Bigg Boss 9 Promo: కలిసిపోయిన రీతూ , కళ్యాణ్.. మండిపడ్డ శ్రీజ!

Bigg Boss Buzzz : వొంగోపెట్టి పుంగి బజా… మాస్క్ మ్యాన్‌కు క్లాస్ పీకిన శివాజీ..

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 మాస్క్ మ్యాన్ అవుట్.. నాలుగు వారాల రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss 9 Elimination: హరీష్ అవుట్.. భరణి నిజస్వరూపం ఇదే, తనూజ అచ్చం నాలాగే.. మాస్క్ మ్యాన్ షాకింగ్ కామెంట్స్

Bigg Boss 9: సేఫ్ గేమర్స్ కి నాగార్జున షాక్.. ఎట్టకేలకు వారి బండారం బట్టబయలు..

Bigg Boss 9 Promo: సండే.. ఫన్‌డే.. మగవాళ్లకు మాత్రమే.. ఓడిన ఓనర్స్‌ టీం, ఐస్‌ క్యూబ్స్‌తో కితకితలు!

Srija Dammu Father: నేను ఇంటింటికి వెళ్లి చెత్త తీస్తా.. శ్రీజ దమ్ము ట్రోల్స్‌పై తండ్రి ఎమోషనల్‌

Bigg Boss 9 Promo: ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న తనూజ.. అసలు ఊహించలేదుగా?

Big Stories

×