E-Paper
Advertisement

Patna Accident: బీహార్‌లో ఘోర ప్రమాదం.. చిన్నారి సహా ఏడుగురు మృతి..

Patna Accident: బీహార్‌లో ఘోర ప్రమాదం.. చిన్నారి సహా ఏడుగురు మృతి..
Advertisement

Road Accident In Patna: బీహార్ రాష్ట్రంలో అత్యంత విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో చిన్నారి సహా ఏడుగురు మృత్యువాతపడ్డారు. అందులో ఓ మహిళ కూడా ఉంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. బీహార్ రాజధాని పాట్నాలో మెట్రో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే, మంగళవారం న్యూ బైపాస్ ప్రాంతంలోని రామ్ లఖాన్ మార్గంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆటుగా వెళ్తున్న ఆటో.. మెట్రో క్రేన్ ను ఢీకొట్టింది.

ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందారు. ప్రమాద సమయంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరో నలుగురు మృతిచెందారు. మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలతో బయపడ్డారు. అతను మోతీహరి నివాసీగా గుర్తించారు. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Also Read: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

అయితే, స్థానికులు భారీగా అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. మెట్రో నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, పనివేళల్లో క్రేన్ చుట్టూ గార్డ్స్ గానీ,సైన్ బోర్డ్స్ గానీ, అడ్డుగా పరదాలుగానీ చుట్టలేదని.. ఈ కారణంగా ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

Tags

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×