E-Paper
Advertisement

ఫోన్ చాటింగ్ చిచ్చు.. ప్రియురాల్ని చంపి ముక్కలు చేసిన ప్రియుడు, ఆ తర్వాత ఏం చేశాడంటే

ఫోన్ చాటింగ్ చిచ్చు.. ప్రియురాల్ని చంపి ముక్కలు చేసిన ప్రియుడు, ఆ తర్వాత ఏం చేశాడంటే
Advertisement

Lover kills Married woman: అక్రమ సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్నాయి. ఫలితంగా మహిళలు, పురుషులు ఈ లోకాన్ని విడిచిపెట్టిన ఉదంతాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫోన్ చాటింగ్‌లో ఓ మహిళకు తన ప్రియుడితో చిన్నపాటి వివాదం చెలరేగింది. తట్టుకోలేకపోయిన ఆ ప్రియుడు, మహిళను చంపి, ఆ శరీరాన్ని ముక్కులు చేసి వేర్వేరు ప్రాంతాల్లో పడేసిన ఘటన యూపీలో వెలుగు చూసింది.

యూపీలో దారుణమైన ఘటన: యూపీలోని జౌన్‌పూర్ జిల్లా ఈ ఘటనకు వేదికైంది. నిందితుడు గుజరాత్‌కు చెందినవాడు. పేరు హేమల్ ఖఖారియా అలియాస్ దిలీప్, వయస్సు 42 ఏళ్లు. ఆదివారం రాత్రి అరెస్టు చేశారు పోలీసులు. మృతురాలు రేష్మా‌ఖాన్ అలియాస్ సనాగా గుర్తించారు పోలీసులు. రేష్మా‌ఖాన్‌కు వివాహం జరిగింది. ఆమె వయస్సు దాదాపు 38 ఏళ్లు.

Advertisement

అనుకోకుండా ఓ వ్యక్తితో రిలేషన్ షిప్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆమెని వారణాసిలోని ఖఖారియా మదియాహు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ టీచర్స్ కాలనీలో ఉన్న వసతి గృహానికి తీసుకువచ్చాడు ఖఖారియా. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. మొబైల్ ఫోన్ చాట్ విషయంలో గొడవ తారాస్థాయికి చేరింది. ఆగ్రహానికి గురైన హేమల్, ఇంట్లో నిద్రిస్తున్న మహిళ గొంతును కత్తితో కోసి చంపాడు.

ఫోన్ చాటింగ్ చిచ్చు.. మహిళని చంపిన ప్రియుడు: అక్కడితో ఆగలేదు.. మృతదేహాన్ని పారవేయడం కష్టమవుతుందనే భయంతో శరీరాన్ని ముక్కలుగా కోశాడు. ఆయా భాగాలను జౌన్‌పూర్ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. అందుకోసం నిందితుడు మార్కెట్ నుండి నల్లటి పాలిథీన్ సంచులను కొనుగోలు చేశాడు. కత్తితో చేతులు, కాళ్లను వేరు చేశాడని పోలీసులు తెలిపారు.

Advertisement

ఆదివారం ఉదయం మడియాహు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాణిపూర్ బైపాస్ సమీపంలో పొదల్లో మహిళ మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలిని ఎవరు, నిందితుడి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలంలో లభించిన ఫోన్ ఆధారంగా వివరాలు సేకరించారు.

ALSO READ: విరాళాల స్కామ్ వ్యవహారం.. అయోధ్య ట్రస్టు‌లో కీలక మార్పులు, ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్‌

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు: రామ్‌నగర్ బ్లాక్ గేట్ సమీపంలో నిందితుడు ఖఖారియాను అడ్డగించారు పోలీసులు. తప్పించుకునే ప్రయత్నంలో నిందితుడి కాలుపై కాల్పులు జరిపడంతో అడ్డంగా చిక్కాడు. నిందితుడి వద్ద నుంచి 0.32 నాటు తుపాకీ, తూటాలు, హత్యకు ఉపయోగించిన కత్తి, మొబైల్ ఫోన్, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Related News

మెట్రో పనుల సమీపంలో కుంగిన రోడ్డు.. గుంతలో పడి బోల్తా కొట్టిన కారు

అమెజాన్ ఆఫీసు బయట పేలుడు.. పలువురికి గాయాలు, బెంగుళూరులో ఘటన

మా లాయర్లలో మంచి నటులున్నారు.. వారితో సినిమా తీయండి: సుప్రీంకోర్టు

సీఈసీ నియామక వివాదంలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి దిగిన సీజేఐ బెంచ్!

పెట్రోల్ బంక్ సీజ్ వివాదం.. ఇండియన్ ఆయిల్ అధికారి దారుణ హత్య.. కేంద్రమంత్రి కీలక ఆదేశాలు!

నడిరోడ్డుపై పడుకుని ప్రియాంక నిరసన.. రాహుల్‌ను ఎత్తుకెళ్లిన పోలీసులు, ఢిల్లీలో హైటెన్షన్!

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. హిందూ పద్ధతిలో పెళ్లి.. 6 నెలల తర్వాత బయటపడ్డ భర్త అసలు రంగు!

ట్రక్కును ఢీకొట్టిన కారు.. ముగ్గురు టెన్నిస్‌ ప్లేయర్లు దుర్మరణం!

Big Stories

Advertisement
×