E-Paper
Advertisement

పోలీసోడి పాడు బుద్ధి.. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి డ్రైవర్‌కే కన్నం! ఖాకీ పవర్ చూపించినా వదలకుండా..!

పోలీసోడి పాడు బుద్ధి.. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి డ్రైవర్‌కే కన్నం! ఖాకీ పవర్ చూపించినా వదలకుండా..!
Advertisement

Cop Steals: సమాజంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే కొన్నిసార్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అభాసుపాలవుతుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. ఖాకీ చొక్కా చూసి గౌరవించి, తోటి మనిషిగా సహాయం చేయబోయిన ఒక లారీ డ్రైవర్‌ను ఓ సబ్-ఇన్స్‌పెక్టర్ దారుణంగా మోసం చేశాడు. నమ్మించి గొంతు కోసేలా.. లిఫ్ట్ ఇచ్చినందుకు డ్రైవర్ జేబులోని డబ్బులనే మాయం చేశాడు. అయితే ఆ డ్రైవర్ మాత్రం అంతటితో వదిలేయలేదు. సింహంలా వెనుకాడి, ఆ పోలీస్ అధికారి గుట్టు రట్టు చేశాడు.

టోల్ ప్లాజా వద్ద లిఫ్ట్.. ఆపై చేతివాటం!
ఈ నమ్మకద్రోహ ఘటన డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ సబ్-ఇన్స్‌పెక్టర్ (ఎస్ఐ), ఓ టోల్ ప్లాజా వద్దకు వెళ్ళడానికి దారిలో వస్తున్న ఒక ట్రక్ డ్రైవర్‌ను లిఫ్ట్ అడిగాడు. పోలీస్ అధికారి కదా, అత్యవసర పని ఉంటుందేమోనని భావించిన ఆ అమాయక డ్రైవర్, గౌరవంతో తన వాహనంలోకి ఎక్కించుకున్నాడు. కట్ చేస్తే.. టోల్ ప్లాజా రాగానే సదరు అధికారి లారీ దిగి, అక్కడ సిద్ధంగా ఉన్న తన వ్యక్తిగత కారులో ఎక్కి వేగంగా వెళ్ళిపోయాడు.

Advertisement

రూ. 20 వేలు మాయం.. డ్రైవర్ పక్కా స్కెచ్!
ఆ అధికారి దిగిపోయిన కాసేపటికే.. లారీ డ్రైవర్ తన జేబును పరిశీలించుకోగా ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది. జేబులో భద్రంగా దాచుకున్న రూ. 20,000 నగదు మాయమైనట్లు గుర్తించాడు. తన వాహనంలోకి ఎక్కింది కేవలం ఆ పోలీస్ అధికారి మాత్రమే కావడంతో, ఈ చేతివాటం ఆయనదేనని డ్రైవర్‌కు అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఖాకీ పవర్‌ను చూసి భయపడి ఊరుకోకుండా, ఎలాగైనా తన కష్టార్జితాన్ని వెనక్కి తెచ్చుకోవాలని డ్రైవర్ గట్టిగా నిశ్చయించుకున్నాడు. లారీని అదే వేగంతో సదరు అధికారి కారు వెనుక పరుగులు తీయించాడు.

10 కిలోమీటర్ల వేట..
దాదాపు 10 కిలోమీటర్ల మేర ఆ కారును సినిమా స్టైల్‌లో వెంబడించిన డ్రైవర్, ఎట్టకేలకు ఒక చోట ఆ పోలీస్ అధికారిని అడ్డుకోగలిగాడు. తన డబ్బులు ఎక్కడంటూ నిలదీశాడు. మొదట ఆ సబ్-ఇన్స్‌పెక్టర్ తన ఖాకీ పవర్‌తో డ్రైవర్‌ను భయపెట్టేందుకు, బెదిరించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ, డ్రైవర్ అస్సలు బెదరలేదు. చుట్టుపక్కల జనాన్ని పోగుచేసి, అందరి ముందే ఆ అధికారి జేబులో నుంచి తన రూ. 20,000 నగదును తిరిగి రికవర్ చేసుకున్నాడు. “పోలీస్ అయి ఉండి ఇలాంటి దొంగ పనులు చేస్తావా?” అంటూ నలుగురిలో ఆ అధికారికి తగిన బుద్ధి చెప్పాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.

Advertisement

Also Read: మంత్రి లేకుండానే పర్యాటక రివ్యూ.. జూపల్లిని రేవంత్ రెడ్డి కూరలో కరివేపాకులా వాడేసి వదిలేశారా?

Related News

కొడుకుని కాపాడబోయి తండ్రి.. ఇద్దరూ పోయారని భార్య.. ఫ్యామిలీని బలితీసుకున్న స్మార్ట్‌ఫోన్!

చక్కెర ధరల పెరుగుదలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. అసలు కారణాలు ఇవేనట!

బిచ్చగాడి అవతారంలో.. యూట్యూబర్ ప్రయోగం.. ఆదాయం చూసి అంతా షాక్!

మైనర్‌ చేతిలో కారు స్టీరింగ్‌.. నోయిడాలో మరో షాకింగ్‌ ఘటన, ఏం జరిగింది?

కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులపై దాడి.. పలువురికి గాయాలు, ఇంతకీ అక్కడ-ఏం జరిగింది?

UPSC జాబ్స్.. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఉద్యోగం.. రూ.1 లక్షపైగా జీతం

అలాంటి హిజ్రాలతో జాగ్రత్త.. తేడా వస్తే కొంప కొల్లేరు, అసలు ఏం జరిగింది?

ఐబిపిఎస్ క్లర్క్ జాబ్స్.. మొత్తం 11,403 ఖాళీలు.. ఈ రోజే లాస్ట్ డేట్

Big Stories

Advertisement
×