E-Paper
Advertisement

ఏడుగురు లెఫ్ట్ హ్యాండర్ల‌తో వెళితే, జింబాబ్వేతో చేతిలోనూ వైట్ వాష్ త‌ప్ప‌దు !

ఏడుగురు లెఫ్ట్ హ్యాండర్ల‌తో వెళితే, జింబాబ్వేతో చేతిలోనూ వైట్ వాష్ త‌ప్ప‌దు !
Advertisement

Hanuma Vihari On India squad for Zimbabwe tour:  ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా (England vs. Team India) మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో జింబాబ్వే టూర్ (India tour of Zimbabwe 2026) వెళ్లే జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇందులో పెను సంచనాలకు తెర లేపుతూ, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ లోని టీమిండియా జట్టును ప్రకటించారు. అయితే ఇందులో సంజు శాంసన్ లాంటి డేంజర్ ఆటగాడికి స్థానం దక్కలేదు. ఎప్పటిలాగే సంజు శాంసన్ (sanju samson) స్థానంలో వైభవ్ సూర్య వంశీ (Vaibhav Sooryavanshi) బరిలోకి దిగబోతున్నాడు. అటు రజత్ పాటిదార్ కు (rajat patidar) కూడా మరోసారి నిరాశ ఎదురైంది. దీంతో అభిమానులు చాలా సీరియస్ అవుతున్నారు. ఇలాంటి క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ హ‌నుమ విహారీ (Hanuma Vihari ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా జట్టులో అందరూ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారని మండిపడ్డారు. ఏడుగురు లెఫ్ట్ హ్యాండర్ల‌తో వెళితే, జింబాబ్వేతో చేతిలోనూ వైట్ వాష్ త‌ప్ప‌దంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు హ‌నుమ విహారీ. మిడిల్ ఆర్డ‌ర్ లో రైట్ హ్యాండ‌ర్లు ఉండాల్సిందేన‌ని తెలిపారు.

Also Read: Joshua Tromp names Haris Rauf as the toughest bowler: హారిస్ రవూఫ్ ఒక్క‌డే ప్ర‌పంచంలోనే భ‌యంక‌ర‌మైన బౌల‌ర్

7 గురు లెఫ్ట్ హ్యాండర్ల‌తో వెళితే, జింబాబ్వేతో చేతిలోనూ వైట్ వాష్ త‌ప్ప‌దు !

Advertisement

టీమిండియా వర్సెస్ జింబాబ్వే మధ్య ఇదే నెలలో టి20 సిరీస్ జరగనుంది. జూలై 23వ తేదీ నుంచి 26వ తేదీ మధ్య మూడు టి20 లు జరగనున్నాయి. అయితే ఈ టోర్నమెంట్ కోసం తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి.. టీమిండియాను ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో 15 మంది సభ్యులను ఫైనల్ చేసింది. అయితే ఇందులో సంజు శాంసన్ పైన వేటు వేసి వైభవ్ ను తీసుకున్నారు. ఈ క్రమంలో దాదాపు 7 మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ లే టీమిండియాలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మినహా దాదాపు అందరూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ లే. వైభవ్ సూర్య వంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివం దుబే, ఇషాన్ కిషన్, హర్ష్ దుబే అందరు కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసేవాళ్లే. ఇలా అందరూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తే… ప్రత్యర్థి జట్టుకు మ్యాచ్ ఫినిష్ చేయడం చాలా సులభం అవుతుందని హనుమ విహారి వెల్లడించారు.

ర‌జ‌త్ పాటిదార్ కు ఒక్క అవ‌కాశం ఇవ్వండి

లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కచ్చితంగా ఉండాల్సిందేనని వెల్లడించారు. అప్పుడే టీమిండియా అద్భుతంగా రానిస్తుందని పేర్కొన్నారు. అలా కాదని ఎడమ చేతివాటం వాళ్లతో బరిలోకి దిగితే… జింబాబ్వే చేతిలో కూడా టీమిండియా వైట్ వాష్ కావడం గ్యారెంటీ అని హెచ్చరించారు. సంజు శాంసన్ ను పక్కకు పెట్టిన బీసీసీఐ… ఒక్కసారి రజత్ పాటిదార్ కు అవకాశం ఇస్తే బాగుందని కీలక సూచనలు చేశారు. దీనిపై బిసిసిఐ పునరాలోచన చేయాలని కోరారు. తానే సెలెక్టర్ అయితే… కచ్చితంగా రజత్ పాటిదార్ కు ఒక్క అవకాశం ఇచ్చేవాడినని తెలిపారు. బెంగళూరు జట్టును రెండుసార్లు ఛాంపియన్ గా నిలబడమే కాకుండా… మిడిల్ ఆర్డర్లో 200కు పైగా స్ట్రైక్ రేట్ తో ఆడగల డేంజర్ ఆటగాడని వెల్లడించారు. అలాంటివాడు టీమిండియా కు అవసరమన్నారు. దీంతో హనుమ విహారి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Also Read: Shahid Afridi Reaction On England vs India, 2nd T20I : ఇంగ్లండ్ చేతిలో దారుణ ఓట‌మి.. టీమిండియా ప‌త‌నం మొద‌లైందంటూ అఫ్రిది సంచ‌ల‌నం !

 

 

 

 

Related News

Tanveer Ahmed:  సంజు శాంస‌న్ క్రైస్తవ మ‌త‌స్థుడు..అందుకే టీమిండియా నుంచి పంపించేశారు!

వైభ‌వ్ కు తీవ్ర గాయం..ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు ప‌యనం ?

అభిషేక్‌, వైభ‌వ్ ఓపెన‌ర్లుగా ప‌నికిరారు…సంజు లేక‌పోతే సంక‌నాకి పోవ‌డం గ్యారెంటీ

ఆస్ట్రేలియా అమ్మాయిలకు డోపింగ్ టెస్టులు చేయాల్సిందే!

Shahid Afridi : జై షా చేతిలో ట్రోఫీ అందించ‌డం క్రికెట్ కే అవ‌మానం!

వైభ‌వ్ ను అవ‌మానించిన బీసీసీఐ..చిన్న‌పిల్ల‌ల‌కు ఇచ్చే టోపీ ఇచ్చి మ‌రీ !

జాకబ్ బెథెల్ కాదు, కోహ్లీ వ‌ల్లే ఇంగ్లాండ్ గెలిచింది..గిట్టు విప్పిన నాజ‌ర్

Big Stories

Advertisement
×