E-Paper
Advertisement

భారీ వర్షాలకు మహారాష్ట్ర అతులాకుతలం.. విరిగిన కొండచరియలు, ముంబై-పుణే మధ్య వాహనాలు నిలిపివేత

భారీ వర్షాలకు మహారాష్ట్ర అతులాకుతలం.. విరిగిన కొండచరియలు, ముంబై-పుణే మధ్య వాహనాలు నిలిపివేత
Advertisement

Maharashtra Rains: రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్ర అంతటా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పగలు-రాత్రిళ్లు వానలు దంచేస్తున్నాయి. ఇక ముంబై, పుణె నగరాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వివిధ జిల్లాల్లో కొండచరియలు విరిగి పడుతున్నాయి. నగరాలను వర్షాలు ముంచెత్తడం, కొండచరియలు విరిగిపడడంతో రోడ్లు కుంగిపోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేశారు.

మహారాష్ట్ర అంతటా భారీ వర్షాలు

Advertisement

ముంబై, పుణె నగరాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని, అప్రమత్తంగా ఉండాలని సీఎం పౌరులను కోరారు. వివిధ జిల్లాల్లో కొండచరియలు విరిగిపడడం, భవనాలు-ఇళ్లు కూలిపోవడం, రోడ్లు డ్యామేజ్ కావడం జరుగుతోంది. పుణె జిల్లాలోని పటాన్ గ్రామంలో సోమవారం వేకువ జామున కొండ చరియలు విరిగిపడ్డాయి.

ఈ ఘటనలో దాదాపు ఇళ్లు శిథిలాల కింద కూరుకుపోయాయి. ప్రమాద సమయంలో నిద్రలో ముగ్గురు కుటుంబసభ్యులు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. మరో 30 నుంచి 35 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా మూడు వేర్వేరు గ్రామాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.

Advertisement

ముంబై-పూణె అతులాకుతలం

జరుగుతున్న ఘటనల గురించి తెలియగానే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఇప్పటివరకు రెండు మృతదేహాలను వెలికి తీసినట్టు తెలిపారు. మిగతావారి కోసం గాలింపు కొనసాగుతోందని ఎన్డీఆర్ఎఫ్ అధికారి తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌ వే, ముంబై-పుణె జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఈ మార్గాల్లో వాహనాలు ప్రయాణించవద్దని సూచన చేశారు. వర్షాల నేపథ్యంలో అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని హెచ్చరిక జారీ చేశారు. రాయ్‌గఢ్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం సమయంలో గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

విరిగిన కొండచరియలు, ముంబై-పుణె మధ్య వాహనాలు నిలిపివేత

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రెడ్ అలర్ట్ ప్రకటించడంతో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కీలక సూచనలు జారీ చేసింది. ముంబై సిటీలో ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించాలని సూచించింది. అత్యవసర విభాగాలు మినహా ప్రభుత్వ, సెమీ-ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యాహ్నం తర్వాత హాఫ్ డే సెలవు ప్రకటించింది.

భారీ వర్షాలతో ముంబై సిటీ వణికింది. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. రెండు రోజులుగా వర్షాలకు 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

ALSO READ: లాటరీలో కోటీశ్వరురాలైన ఢిల్లీ మహిళ.. రూ. 65 కోట్ల జాక్‌పాట్, బిగ్ ఆఫర్

బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తాజా విపత్తు నివేదిక ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 523 చెట్లు కూలిపోయాయి. అందులో 185 ఐలాండ్ సిటీలో, తూర్పు శివారు ప్రాంతాల్లో 150, పశ్చిమ శివారు ప్రాంతాల్లో 188 చెట్లు కూలిపోయాయి.

 

 

Related News

లాటరీలో కోటీశ్వరురాలైన ఢిల్లీ మహిళ.. రూ. 65 కోట్ల జాక్‌పాట్, బిగ్ ఆఫర్

అయోధ్యలో మరో ఇంజినీరింగ్ మార్వెల్.. ADA భవనంలో కూలిన మెట్లు.. తృటిలో తప్పిన ముప్పు!

భర్తను సజీవంగా కాలువలో పడేసి, 49 సార్లు ప్రియుడికి ఫోన్‌కాల్స్ , హర్యానాలో దారుణమైన ఘటన

మహానగరంలో విషాదం.. భారీ వర్షాలకు కూలిన భవనం.. స్పాట్‌లో ఆరుగురు మృతి!

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత, తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని? కౌన్సెలింగ్‌కు ముందు

July 6 Holiday: జులై 6న స్కూల్స్, కాలేజీలకు సెలవా?

బిష్ణోయ్ గ్యాంగ్‌కు కోలుకోలేని షాక్.. జాయింట్ ఆపరేషన్‌లో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ మృతి!

Big Stories

Advertisement
×