E-Paper
Advertisement

బుద్ధుడి స్టాచ్యూ ఇచ్చే శాపం… కన్ను కొడితే ఖతం… ఒళ్లు గగుర్పొడిచే సీన్లున్న హర్రర్ థ్రిల్లర్

బుద్ధుడి స్టాచ్యూ ఇచ్చే శాపం… కన్ను కొడితే ఖతం… ఒళ్లు గగుర్పొడిచే సీన్లున్న హర్రర్ థ్రిల్లర్
Advertisement

Korean Psychological Thriller Series: బుద్ధుడిని చాలా చోట్ల దేవుడిగా భావిస్తారు, పూజిస్తారు. కానీ అదే దేవుడి విగ్రహం మనుషుల్ని ఖతం చేస్తే… ప్రశాంతతకు మారుపేరు అయిన ఆ విగ్రహం శాపంగా మారి మనుషులు ఒకరినొకరు చంపుకునేలా చేస్తే… ఇలాంటి వెరైటీ స్టోరీతో తెరకెక్కిన సినిమానే ఈరోజు మన మూవీ సజెషన్. నిజానికి ఓ వ్యక్తి బుద్దుడి విగ్రహాన్ని తుడవడం, అదే టైమ్ లో తెరుచుకున్న బుద్ధుడి కంట్లో ఆ వ్యక్తి పడడం అనే సీన్ ఇన్స్టా ను తెగ ఊపేసింది. ఆ వైరల్ మూవీనే ఇప్పుడు మనం మాట్లాడుకునేది. ‘మాన్‌స్ట్రస్’ (Monstrous) అనే టైటిల్ తో రూపొందిన ఈ కొరియన్ సూపర్ నేచురల్ హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్‌… 2022లో విడుదలై సంచలనం సృష్టించింది. మరి ఈ మూవీని ఎక్కడ చూడవచ్చు ? తెలుగులో ఉందా లేదా ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

జిన్యాంగ్ అనే చిన్న గ్రామంలో కథ మొదలవుతుంది. ఆ ఊరి మైనింగ్ త్రవ్వకాల సమయంలో పురాతనమైన ఒక బుద్ధుని విగ్రహం బయట పడుతుంది. శతాబ్దాలుగా ఆ విగ్రహం కళ్లకు కట్టిన బట్టను ఎవరో తొలగించడంతో, దానిలో బందీగా ఉన్న భయంకరమైన శాపం కట్టలు తెంచుకుంటుంది. ఆ విగ్రహాన్ని చూసినా లేదా దాని నీడ పడిన వ్యక్తుల మనసులో ఒక వింత మార్పు వస్తుంది. వారి కళ్లు పూర్తిగా నల్లగా మారిపోయి, లోపల దాగి ఉన్న చేదు జ్ఞాపకాలు, పగ, భయాలు, ప్రతీకారాలు బయటకు వచ్చి కంట్రోల్ కోల్పోతారు.

Advertisement

సాధారణ మనుషులు భయంకర రాక్షసులుగా మారి, తమ చుట్టూ ఉన్నవారిని వేటాడి చంపడం ప్రారంభిస్తారు. దీంతో ఊరంతా ఒక్కసారిగా నరకప్రాయంగా మారిపోతుంది. ఈ విపత్తు మధ్యలో జంగ్ కి-హూన్ అనే పురావస్తు శాస్త్రవేత్త, పారానార్మల్ పరిశోధకుడు తన భార్య లీ సూ-జిన్ ను రక్షించడానికి ఆ గ్రామానికి వస్తాడు. సూ-జిన్ తన కూతురు చనిపోయిందనే బాధలో ఒంటరిగా ఆ గ్రామంలో బతుకు వెల్లదీస్తుంది. చివరికి ఆమె కూడా ఆ విగ్రహం శాపం నుండి తప్పించుకోలేకపోతుంది.

కి-హూన్, సూ-జిన్ కలిసి ఆ విగ్రహం వెనుక దాగి ఉన్న తాంత్రిక రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయాణంలో ఆయన ఆ శాపాన్ని ఎలా ఎదుర్కొంటారు? శాపం నుండి గ్రామస్తులను, తమను తాము ఎలా కాపాడుకుంటారు ? ఆ విగ్రహం శాపం వెనుక ఉన్న నిజం ఏమిటి ? శాపం ఎందుకు ఏర్పడింది ? దాన్ని ఎలా అరికట్టాలి ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.

తెలుగులోనూ అందుబాటులో

Advertisement

గుడ్ న్యూస్ ఏంటంటే… ఈ సిరీస్ ప్రస్తుతం JioCinemaలో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. ‘ట్రైన్ టు బుసాన్’ దర్శకుడు యాన్ సాంగ్-హో కథ అందించగా, జాంగ్ కున్-జే దర్శకత్వం వహించిన ఈ 6 ఎపిసోడ్ల సిరీస్ అద్భుతంగా ఉంటుంది. ఇంకా చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి.

Read Also : కాలం ఆగిపోయే గ్రామం… కిరాక్ కన్నడ ఫాంటసీ కామెడీ డ్రామా

Tags

Related News

మిస్టీరియస్ జంతువులను పరిగెత్తించి కొట్టే స్కూల్ పిల్లలు… కొరియన్ యాక్షన్ ప్యాక్డ్ మాస్టర్ పీస్

ఈ పొగను పీలిస్తే పోతారు మొత్తం పోతారు… దిమ్మతిరిగే కొరియన్ మిస్టరీ హర్రర్ సిరీస్

షార్క్-పిచ్చి సీరియల్ కిల్లర్… టూరిస్టులను కిడ్నాప్ చేసి బలిచ్చే అరాచకం

ఉన్నట్టుండి డబ్బుల ప్రింటింగ్ మిషన్ ఊడిపడితే… లాస్ట్ ట్విస్ట్ అస్సలు మిస్ అవ్వొద్దు

మార్నింగ్ బాయ్ ఫ్రెండ్, నైట్ గర్ల్ ఫ్రెండ్ తో… నవ్వి నవ్వి సచ్చిపోతే ఎవడిదిరా బాధ్యత

చెవులు కోసుకుని కరకర నమిలేసే పిల్ల పిశాచి… ‘కాంతారా’ లాంటి థ్రిల్లర్

ఒకే అపార్ట్మెంట్లో చిక్కుకుపోయే జంట… కట్ చేస్తే స్పైన్ చిల్లింగ్ ట్విస్ట్

Big Stories

Advertisement
×