E-Paper
Advertisement

Actor Shiva Raj Kumar | నటుడు శివ రాజ్‌కుమార్‌కు ఎంపీ టికెట్.. కర్ణాటక కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్!

Actor Shiva Raj Kumar | ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌ కు వచ్చే ఎన్నికల్లో లోక్‌సభ టికెట్‌ ఇస్తామని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ బహిరంగంగా ఆఫర్‌ చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన విజయంతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని వ్యూహాలు రచిస్తోంది.

కర్ణాటకలో అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌.. ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌ కు పబ్లిక్‌గా ఓ ఆఫర్‌ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఈ స్టార్‌ హీరోను కోరారు.

Advertisement

బెంగళూరులో ఆర్యా ఈడిగ సమావేశంలో శివ రాజ్‌కుమార్‌ కు డీకే శివకుమార్ ఎంపీ టికెట్ ఆఫర్ చేశారు. చాలా సినిమా షూటింగ్‌లు పూర్తిచేయాల్సి ఉందని శివ రాజ్ కుమార్ అనడంతో.. సినిమాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చన్నారు డీకే.

అయితే, తన భార్య గీతకు రాజకీయాలపై ఆసక్తి ఉందన్నారు నటుడు శివ రాజ్‌కుమార్. ఆమెకు టికెట్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. గీత ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. 2014లో ఆమె మాజీ సీఎం యడియూరప్పపై జేడీఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు గీత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆమె సోదరుడు మధు బంగారప్ప తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×