E-Paper
Advertisement

Amazon : ఉద్యోగులపై మితిమీరిన నిఘా.. అమెజాన్ కు భారీ జరిమానా..

Amazon : ఉద్యోగులపై మితిమీరిన నిఘా.. అమెజాన్ కు భారీ జరిమానా..

Amazon : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తరచూ వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకూ అయోధ్యప్రసాదం పేరుతో.. భక్తులకు టోకరా వేసిందన్న వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా.. తన ఉద్యోగులపై మితిమీరిన నిఘా ఉంచిందన్న కారణంగా భారీ జరిమానా పడింది. ఫ్రాన్స్ డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ సీఎన్ఐఎల్ (CNIL) భారీ జరిమానా విధించింది. 32 మిలియన్ యూరోలు అంటే.. భారత కరెన్సీలో అక్షరాలా రూ.280 కోట్లు చెలలించాల్సిందేనని ఆదేశించింది.

యూరోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ (GDPR) ప్రకారం ఉద్యోగుల వ్యక్తిగత డేటా సేకరణ, వినియోగంపై వారి అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ.. అమెజాన్ నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల డేటాను సేకరించినట్లు సీఎన్ఐఎల్ ఆరోపించింది. ఉద్యోగుల నుంచి వ్చిన ఫిర్యాదు ఆధారంగానే విచారణ జరిపి జరిమానా విధించినట్లు తెలిపింది.

వినియోగదారులు ఆర్డర్ చేసే ఉత్పత్తుల వివరాలను నమోదు చేసే స్కానింగ్ యంత్రాల ద్వారా నిఘా ఉంచినట్లు సీఎన్ఐఎల్ తెలిపింది. 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పనిచేయకపోతే.. యాజమాన్యానికి అలర్ట్ మెసేజ్ వెళ్తుందని, వాటి ఆధారంగా ఉద్యోగి పనితీరుని విశ్లేషిస్తున్నట్లు వెల్లడించింది. దీనివల్ల సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని వెల్లడించింది. కాగా.. దీనిపై అమెజాన్ తన చర్యలను సమర్థించుకుంది. వినియోగదారులకు మెరుగైన సేవల్ని అందించేందుకు ప్రొడక్ట్ డెలివరీకి ముందు సిబ్బంది పూర్తిస్థాయిలో తనిఖీ చేస్తున్నారా లేదా అని తెలుసుకునేందుకే ఇలాంటి వ్యవస్థను తీసుకొచ్చినట్లు చెప్పింది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×