BigTV English

Suhas: ట్రైలర్‌ అదిరిపోయింది.. సుహాస్ ఖాతాలో మరో హిట్ గ్యారంటీ..!

Suhas: ట్రైలర్‌ అదిరిపోయింది.. సుహాస్ ఖాతాలో మరో హిట్ గ్యారంటీ..!

Suhas: టాలీవుడ్‌లో మొదటగా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ.. ఆ తర్వాత సినిమాలలో కథానాయకుడిగా చేసి అందరినీ ఆకట్టుకున్న నటుడు సుహాస్. గతంలో కలర్ ఫోటో సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ నటుడు ఈ సినిమా తర్వాత మరికొన్ని చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజాగా దర్శకుడు దుష్యంత్ కటికనేని డైరెక్షన్‌లో ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ టైటిల్‌తో కొత్త సినిమాలో నటిస్తున్నాడు


ఈ మూవీని ఫిబ్రవరి 2వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇదివరకే అనౌన్స్ చేశారు. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే.. ఈ సినిమా మొత్తం పల్లెటూరు బ్యాక్‌గ్రౌండ్‌లో తెరకెక్కినట్లు అర్థం అవుతోంది. ఇందులో సుహాస్ బ్యాండ్ వాయిస్తూ కనిపిస్తున్నాడు. అలాగే తన నటనతో మరోసారి ఆడియన్స్‌ను ఆకట్టుకోనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్ కూడా అదిరిపోయేలా ఉంది. మొత్తానికి సుహాస్‌కి ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా కనిపిస్తుంది.

ఈ సినిమాలో సుహాస్‌కి జోడిగా శివాని నాగరం నటిస్తోంది. ‘పుష్ప’ ఫేం నటుడు జగదీష్‌తో పాటు తదితర నటీనటులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ట్రైలర్ మొత్తం ఈ సినిమాకి హైప్ అయ్యేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇందులో సుహాస్ కామెడీ టైమింగ్ , యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×