BigTV English

Us Aid: 150 దేశాలకు అమెరికా చేయూత

Us Aid: 150 దేశాలకు అమెరికా చేయూత

Us Aid : అంతర్యుద్ధం, మానవతా సంక్షోభం నెలకొన్న దేశాలకు అమెరికా అధికంగా ఆర్థిక చేయూత అందిస్తోంది. 2021లో అగ్రరాజ్యం నుంచి 150 దేశాలు 50 బిలియన్ డాలర్ల మేర సాయాన్ని పొందాయి. అదే ఏడాది అమెరికా బలగాల ఉపసంహరణ దరిమిలా అఫ్ఘానిస్థాన్‌ అధిక సాయం పొందగలిగింది.


ఆ దేశానికి మానవతా సాయం కింద 1.5 బిలియన్ డాలర్లను అమెరికా అందజేసింది. అత్యవసర ఆహార సాయం కింద ఇథియోపియా 1.4 బిలియన్ డాలర్లు, జోర్డాన్ 1.3 బిలియన్ డాలర్లు పొందాయి. యెమెన్‌కు 1.1 బిలియన్ డాలర్లు, దక్షిణ సూడాన్‌కు 1 బిలియన్ డాలర్ల సాయాన్ని అమెరికా అందజేసింది.

ఎమర్జెన్సీ ఫుడ్ అసిస్టెన్స్, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, గ్లోబల్ హెల్త్ సప్లై చెయిన్, కౌంటర్-నార్కొటిక్స్ కింద వివిధ దేశాలను అగ్రరాజ్యం ఆదుకుంది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 891 మిలియన్ డాలర్లు, సిరియా 844, నైజీరియా 828, కొలంబియా 761, సూడాన్ 620 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అమెరికా నుంచి అందుకున్నాయి.


ఇక మొత్తం మీద అధిక మొత్తంలో విదేశీ సాయం పొందిన దేశంగా ఇజ్రాయెల్ అగ్రభాగాన నిలుస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం అమెరికా నుంచి ఆ దేశం పొందిన సాయం 312.5 బిలియన్ డాలర్లు. 1946-21 మధ్య అమెరికా అందించిన ఆర్థిక సాయంలో నాలుగోవంతు ఐదు దేశాలకు వెళ్లింది.

వాటిలో ఇజ్రాయెల్ అగ్రభాగాన ఉండగా.. 184.5 బిలియన్ల సాయం అందుకున్న వియత్నాం రెండో స్థానంలో నిలిచింది. ఈజిప్టు 183.7 బిలియన్ డాలర్లు, అఫ్ఘానిస్థాన్ 158.9 బిలియన్ డాలర్లు, దక్షిణకొరియా 120.7 బిలియన్ డాలర్ల సాయాన్ని అందుకున్నాయి.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×