BigTV English

Chandrababu Health Update : చంద్రబాబు ఆరోగ్యంపై స్పందించిన పవన్.. ప్రభుత్వ వైఖరిపై ఫైర్

Chandrababu Health Update : చంద్రబాబు ఆరోగ్యంపై స్పందించిన పవన్.. ప్రభుత్వ వైఖరిపై ఫైర్

Chandrababu Health Update : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రస్తుతం జుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. అయితే.. చంద్రబాబు జైలుకు వెళ్లి నెలరోజులకు పైగానే అయినా.. ఇంతవరకూ ఆయన జైలు గోడలు దాటి బయటకు రాలేదు. చంద్రబాబు ఆరోగ్యం ఏం బాలేదంటూ.. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యులు సరైన నివేదిక ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.


ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. జనసేన అధికారిక ఖాతాలో ఈ మేరకు పవన్ ఒక లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానుషంగా ఉందన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు. ఆయన వయసును దృష్టిలో ఉంచుకుని.. ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ఆరోగ్యం విషయంలోనూ రాజకీయ కక్షసాధింపు ధోరణి సరికాదని హితవు పలికారు.

చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు.. సోషల్ మీడియా, మీడియా ఛానళ్ల ద్వారా ఆందోళన చెందితే.. ప్రభుత్వ సలహాదారులు, జైళ్ల శాఖ అధికారులు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరిని సూచిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం వైద్యుల నివేదికలను పట్టించుకోకపోవడంపై న్యాయస్థానం జోక్యం చేసుకుని విచారణ చేయాలని, చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.


Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×