E-Paper
Advertisement

Maharashtra: మహారాష్ట్రలో విషాదం.. సోలాపూర్ బేకరీ ఓనర్ 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య

Maharashtra: మహారాష్ట్రలో విషాదం.. సోలాపూర్ బేకరీ ఓనర్ 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
Advertisement

Maharashtra: మహారాష్ట్రలోని పుణే నగరంలో ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది. సోలాపూర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ‘ముల్తానీ బేకరీ’ యజమాని సునీల్ మోతీలాల్ సదరాంగని నిర్మాణంలో ఉన్న ఒక ఎత్తైన భవనంపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయారు. కొన్నేళ్ల క్రితమే ఆయన సోలాపూర్ నుంచి పుణేకు వచ్చి అక్కడే స్థిరపడ్డారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అప్రమత్తమైనా అందని ప్రాణం
అయితే విజాపూర్ రోడ్డులో కొత్తగా నిర్మిస్తున్న 17 అంతస్తుల భవనంపై సునీల్ అనుమానాస్పదంగా తిరుగుతుండటం గమనించిన పొరుగువారు వెంటనే అప్రమత్తమయ్యారు. వారు భవన కాపలాదారులకు సమాచారం అందించడంతో, వాచ్‌మెన్ మరో వ్యక్తితో కలిసి పైకి వెళ్లి ఆయన్ని వారించే ప్రయత్నం చేశారు. వారి మాట విని కిందకు వస్తున్నట్లు నటించిన సునీల్, పదో అంతస్తుకు చేరుకోగానే ‘కారు తాళాలు పైన మర్చిపోయాను’ అని చెప్పి వేగంగా తిరిగి పైకి వెళ్లారు.

Advertisement

క్షణాల్లో జరిగిన ఘోరం
ఆయన వెంటే వాచ్‌మెన్ పరుగెత్తినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. భవనంపైకి చేరుకున్న వెంటనే సునీల్ ఒక్కసారిగా కిందకు దూకేశారు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆయన్ని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు. ఈ ఉదంతానికి సంబంధించిన దృశ్యాలను కొందరు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించగా, ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Also Read: బీహార్ ఎన్నికల రద్దుకు ప్రశాంత్ కిశోర్ పిటిషన్.. ప్రజలు తిరస్కరిస్తే.. కోర్టులకు వస్తారా? సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

Advertisement

కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సునీల్ కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అంతటి విజయవంతమైన వ్యాపారవేత్త ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేమిటి అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆర్థికపరమైన కారణాలా లేదా మరేదైనా వ్యక్తిగత ఇబ్బందులా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×