E-Paper
Advertisement

Mahabubabad Politics: వార్డు ఎన్నికల్లోనూ సర్పంచ్ ఎన్నికల దుస్థితేనా? పోటాపోటీగా ఖర్చులు.. ఓడితే బాధలు తప్పవా?

Mahabubabad Politics:  వార్డు ఎన్నికల్లోనూ సర్పంచ్ ఎన్నికల దుస్థితేనా? పోటాపోటీగా ఖర్చులు.. ఓడితే బాధలు తప్పవా?
Advertisement

Mahabubabad Politics:  మహబూబాబాద్ స్వేచ్ఛ: సర్పంచ్ ఎన్నికల్లో పోటీలో నిలబడిన అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేశారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అత్యధికంగా ఓట్ల కోసం డబ్బును ఖర్చు చేశారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చిన మరునాటి నుంచి ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇచ్చారో వాళ్ల వద్ద నుంచి మేము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని ఇండ్ల వద్దకు వెళ్లి లొల్లి లొల్లి చేశారు. ఎన్నికల్లో ఖర్చు చేశాక మళ్లీ తిరిగి అడిగే సాంప్రదాయం గత ఎన్నికల్లో కనిపించడం కలకలం సృష్టించింది. స్వతహాగా ఎన్నికల కోసం ఖర్చు చేసిన సర్పంచ్ అభ్యర్థులు ఓడిపోయాక తమ డబ్బులు తమకు ఇవ్వాలనే డిమాండ్ తో ప్రజలను వేధించడం కొత్త చర్యకు దారి తీసినట్టయింది.

ఎన్నికల సుడిగుండంలో పోటాపోటీగా, విచ్చలవిడిగా ఖర్చు

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నవారు కేవలం రూ.1,50,000 మాత్రమే ఎన్నికల కోసం ఖర్చు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అధికారికంగా రూ.1,50,000 వరకే ఖర్చులు చూపెడుతూ అనధికారికంగా 50 లక్షల పైగానే ఒక్కో వార్డు కౌన్సిలర్ ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ దిశగానే ప్రచారంలో భాగంగా రోజుకు రూ.1,00,000 తగ్గకుండా ఖర్చు చేస్తున్నారు. ప్రచారం నిర్వహించే వారికి మధ్యాహ్న భోజనం, సాయంత్రం మద్యం, ఒక్కొక్కరికి రూ.400 నుండి రూ. 600 వరకు నగదును ఇస్తున్నారు. ఇలా ప్రతిరోజు అంటే నామినేషన్ల తుది జాబితా వెలువడినప్పటి నుంచి ప్రచారం చివరి రోజు వరకు దాదాపు 6 రోజులు సమయం ఉండడంతో ఒక్కో వార్డు కౌన్సిలర్ కు రూ. 6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. అదేవిధంగా మైకులు, వాహనాలు, ఇతర ఎన్నికల సామాగ్రికి సంబంధించిన ఖర్చు సదా మామూలే.

Advertisement

Also Read: Ragi Chips Recipe: ఇంట్లోనే కరకరలాడే రాగి చిప్స్.. బరువు తగ్గడానికి బెస్ట్ స్నాక్, రెడీ చేయడం సింపుల్

ఓడిపోయాక ఖర్చు పెట్టామని బాధపడకండి

న్నికల సమయంలో ప్రతి ఒక్కరు ఓటర్ దేవుళ్లపై అభ్యర్థులు అమోఘమైన నమ్మకాన్ని పెట్టుకుంటారు. ఆ నమ్మకంతోటే అత్యధికంగా ఖర్చు పెట్టేందుకు వినపడకుండా ఎంత పడితే అంత ఖర్చు పెట్టేందుకు సాహసిస్తుంటారు. ఆ సమయంలో ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది అభ్యర్థులకు అర్థమవ్వకుండా ఉంటుంది. అలాంటి సమయంలో చేతికి ఎంత అందితే అంత ఖర్చు పెట్టేందుకు పోటాపోటీగా, విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అప్పుడు ఎంత ఖర్చు చేశాం అనే విషయాలను ఆలోచిస్తూ ఉంటారు. ఓడిపోయిన వారికి గెలిచిన వారికి సంతోషం లో ఖర్చుపెట్టిన డబ్బులన్నింటిని మర్చిపోతారు. గెలిచినవారు ఏదో రూపంలో ఖర్చుపెట్టిన డబ్బులన్నింటినీ కూడగట్టుకునేందుకు నానా రకాల ప్రయత్నాలు కొనసాగిస్తారు. అందుకే ఖర్చు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఆర్థిక పరిస్థితులను అంచనా వేసుకొని ఖర్చు చేస్తే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. సర్పంచ్ ఎన్నికల్లో కొంతమంది ఓడిపోయిన అభ్యర్థులు ఓటర్ల వద్దకు వెళ్లి తమ డబ్బులు తమకి ఇవ్వమని అడిగిన సందర్భాలు రాష్ట్రంలో కోకొల్లలుగా దర్శనమిచ్చాయి. వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లోను అదే పరిస్థితి రిపీట్ కాకుండా చూసుకోవాలి. జాగ్రత్త సుమీ ఖర్చు పెట్టేముందు ఆలోచించండి.

Advertisement

Also Read: Jagadish Reddy: ఉమ్మడి నల్గొండలో గులాబీ ఎదురీత.. పురపోరులో గెలుపు కష్టమేనా?

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×