IND Vs PAK: ఆపరేషన్ సిందూర్ సమయంలో.. పాకిస్తాన్ అమృత్సర్‌లోని స్వర్ణ దేవాలయంపై దాడి చేయడానికి ప్రయత్నించింది. దీనికి భారత సైన్యం తగిన సమాధానం ఇచ్చింది. మే 8న పాకిస్తాన్ చేసిన ఈ దాడిని భారత సైన్యం తన బలమైన వైమానిక రక్షణ వ్యవస్థ సహాయంతో భగ్నం చేసింది. జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GOC) మేజర్ జనరల్ కార్తీక్ శేషాద్రి సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న పాక్ :
పాక్ , పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం చేసిన దాడులకు ప్రతీకారంగా మే 7-8 మధ్య అర్థ రాత్రి పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించిందని మేజర్ జనరల్ కార్తీక్ తెలిపారు. పాకిస్తాన్ కు చట్టబద్ధమైన సైనిక లక్ష్యాలు లేవని.. భారత్‌లోని పౌర, మతపరమైన ప్రదేశాలపై దాడి చేస్తుందని భావిస్తున్నట్లు భారత ఆర్మీ వెల్లడించారు.
సైన్యానికి చట్టబద్ధమైన లక్ష్యం లేదు:
మేజర్ జనరల్ మీడియాతో మాట్లాడుతూ.. పాక్ సైన్యానికి ఎటువంటి చట్టబద్ధమైన లక్ష్యాలు లేవని తెలిసినా, వారు భారత సైనిక స్థావరాలను, మతపరమైన ప్రదేశాలు సహా పౌరులను లక్ష్యంగా చేసుకుంటారని తాము ముందుగానే ఊహించామని అన్నారు. వీటిలో స్వర్ణ దేవాలయం అత్యంత ప్రముఖమైందని తెలిపారు.
చీకటిలో డ్రోన్లు, సుదూర క్షిపణులతో దాడి:
మే 8 ఉదయం స్వర్ణ దేవాలయంపై దాడి జరిగిందని మేజర్ జనరల్ శేషాద్రి తెలిపారు. “మే 8 తెల్లవారుజామున చీకటిలో, పాకిస్తాన్ మానవ రహిత వైమానిక ఆయుధాలతో, ప్రధానంగా డ్రోన్లు, దీర్ఘ శ్రేణి క్షిపణులతో భారీ వైమానిక దాడిని ప్రారంభించింది” అని ఆయన అన్నారు.
Also Read: పాక్ గూడచర్య.. నిన్న యూట్యూబర్ జ్యోతి, నేడు బిజినెస్‌మేన్ షాజాద్, రేపు ఇంకెవరు?
పాక్ కుట్రలను తిప్పికొట్టిన సైన్యం:
భారత సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉందని.. అందుకే పాక్ నుండి వచ్చే అన్ని రకాల ముప్పును అడ్డుకుని నాశనం చేసిందని ఆయన అన్నారు. ముందుగా దాడిని ఊహించి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మా ధైర్యవంతులైన , అప్రమత్తమైన ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ ఆఫీసర్లు పాకిస్తాన్ సైన్యం యొక్క కుట్రలను భగ్నం చేసి, స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న అన్ని డ్రోన్లు, క్షిపణులను కాల్చివేశారు. ఈ విధంగా మన పవిత్ర స్వర్ణ దేవాలయంపై ఒక్క గీత కూడా పడకుండా జాగ్రత్త పడ్డామని స్పష్టం చేశారు.
#WATCH | Amritsar, Punjab: Major General Kartik C Seshadri, GOC, 15 Infantry Division says "Indian Army is a professional, righteous and responsible force which in spite of grave provocations, has always responded in a calibrated and measured manner. We target only terrorists in… https://t.co/AAJsOE4zqg pic.twitter.com/z95jbU24qK
— ANI (@ANI) May 19, 2025