UP News: ఇంటి గుట్టుకు లంకకు చేటు ఈ సామెత దేశంలో ఉగ్రవాదులకు సహకరిస్తున్న వాళ్లకు అతికినట్టు సరిపోతుంది. పాకిస్తాన్ తరపున గూడచర్యం చేస్తున్న ఆరోపణలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్టు కాగా, తాజాగా యూపీకి చెందిన ఓ బిజినెస్‌మేన్ వంతైంది. ప్రస్తుతం ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారణ మొదలు పెట్టారు అధికారులు.
పహల్‌గామ్ ఉగ్ర దాడి,ఆపరేషన్ సిందూర్ తర్వాత భద్రతపై భారత్ ప్రభుత్వం మరింత దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు సహకరిస్తున్న దేశద్రోహులపై గురిపెట్టాయి నిఘా వర్గాలు. తాజాగా పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్న పలువురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త షాజాద్‌ను అరెస్ట్ చేసింది స్పెషల్ టాస్క్ ఫోర్స్.
ఉత్తరప్రదేశ్ రాంపూర్‌కి చెందిన బిజినెస్ మేన్ షాజాద్ పాకిస్థాన్ ఐఎస్ఐ తరఫున సరిహద్దుల్లో గూఢచర్యం చేస్తున్నట్లు గుర్తించాయి నిఘా వర్గాలు. అతడు ఐఎస్‌ఐతో సంబంధాలు కొనసాగిస్తూ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని దాయాది దేశానికి చేర వేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
ఈ నేపథ్యంలో అతడు పలుమార్లు పాకిస్తాన్ వెళ్లాడు. ఆదేశానికి కాస్మెటిక్స్, దుస్తులు, సుగంధ ద్రవ్యాలు ఇతర వస్తువుల రవాణా ముసుగులో ఆ వ్యాపారవేత్త ఈ చర్యలకు పాల్పడేవాడని భావిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఐఎస్ఐ తర్వాత దేశంలో కోవర్టుగా వ్యవహరించేవాడు.
ALSO READ: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా.. హైదరాబాద్, పూరీ ప్రాంతాలతో లింకులు!
బిజినెస్‌మేన్ షాజాద్ యూపీలోని రాంపూర్ జిల్లా. యూపీలోని ఇతర ప్రాంతాల నుండి ప్రజలను ఐఎస్ఐ కోసం పని చేయడానికి పాకిస్తాన్‌కు చాలామందిని పంపాడని STF పేర్కొంది. ఆయా వ్యక్తులకు వీసాలను ISI ఏజెంట్లు ఏర్పాటు చేసేవారని ఓ ఏజెన్సీ తెలిపింది.
భారత్‌లో సిమ్‌కార్డ్‌లను కొనుగోలు చేసి దాయాది దేశంలో ఉన్న ఐఎస్‌ఐ ఏజెంట్లకు అందించేవాడని తేలింది. ఇదే తరహాలో పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ చిక్కింది హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా. గూడచర్యం వ్యవహారంలో ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే పట్టుబడ్డారు. రేపట రోజున ఈ రాడార్ కింద పని చేస్తున్నవారు ఇంకెంత మంది బయటపడతారో చూడాలి.
మరోవైపు దేశంలోని అక్రమంగా చొరబడుతున్న ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రతీ రోజు ముష్కరులు ఇద్దరు లేదా ముగ్గుర్ని మట్టుబెడుతున్నారు భారత బలగాలు. ఇప్పటికే వారికి సంబంధించి స్థావరాలను ధ్వంసం చేశారు కూడా. ఇదే దూకుడు కంటిన్యూ అయితే జమ్మూకాశ్మీర్‌కు పెద్ద ఎత్తున పర్యాటకు రావచ్చని అంచనా వేస్తోంది అక్కడ ప్రభుత్వం.