Today Gold Rate: గత కొద్ది రోజులుగా శాంతించిన పసిడి ధరలు.. మళ్లీ స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ఒకరోజు ఉన్న ధర.. మరొక రోజు ఉండదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. తాజాగా గోల్డ్ రేట్స్ చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారానికి రూ.350 పెరిగి, రూ.87,550 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారానికి రూ.380 పెరిగి రూ.95,510 వద్ద ట్రేడింగ్ అవుతోంది.
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండటానికి ప్రధాన కారణం.. అమెరికా డాలర్ బలహీనపడటం, ద్రవ్యోల్బణం, ఆర్ధిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, బంగారం ఎగుమతి, దిగుమతి విధానాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాలు మొదలైనవి బంగారం ధరలు పెరగడానికి కారణం అని నిపుణులు చెబుతున్నారు.
అయితే మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం.. రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరుగుతుందా.. తగ్గుతుందా? అనే కోణంలో పరిస్థితులు మారుతున్నాయనే చెప్పుకోవాలి. ప్రస్తుతం అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్‌కు దాదాపు 90 రోజుల నుంచి బ్రేక్ పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే తులం బంగారం రూ.80 వేల దిగివచ్చే అవకాశం ఉందంటూ.. ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.
ఇదిలా ఉంటే.. దేశీయ మార్కెట్లో సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సాంకేతాలు నడుమ మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు సెన్సెక్స్ 0.09 శాతం తగ్గి 82,259.86 వద్ద ముగిసింది. అదే సమయంలో, NSE నిఫ్టీ 50 8.65 పాయింట్లు శాతం తగ్గి 25,011 వద్ద ఉంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.87,550 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95, 510 పలుకుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,550 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95, 510 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,550 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95, 510 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,700 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95, 660 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,550 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95, 510 వద్ద కొనసాగుతోంది.
ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,550 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.95, 510 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్డ్.. జూన్ 1 నుంచి చార్జీల మోత
వెండి ధరలు ఇలా..
బంగారం ధరలు మాదిరిగా వెండి ధరలు దూసుకుపోతున్నాయి. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ.1,09,000 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.98,000 వద్ద కొనసాగుతోంది.