Arvind Kejriwal: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన E20 పెట్రోల్ విధానంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనికి నిరసనగా ఢిల్లీలో ఆయన అధ్యక్షతన భారీ సదస్సు జరిగింది. ఈ సమావేశానికి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా దాదాపు ఆరు లక్షల మందికి పైగా హాజరవడం విశేషం. E20 పెట్రోల్‌ను వ్యతిరేకిస్తూ సేకరించిన రెండు లక్షల సంతకాల పిటిషన్‌ను వచ్చే మంగళవారం స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీకి అందజేస్తానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
E20తో వాహనదారులకు నష్టం
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఇథనాల్ కలపడం వల్ల వాహనాల మైలేజ్ పడిపోవడమే కాకుండా ఇంజిన్లు కూడా పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు దీనిపై ప్రభుత్వం నిర్వహించిన అధ్యయన నివేదికలను వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మోదీ, నితిన్ గడ్కరీతో పాటు అమెరికా ట్రేడ్ డీల్స్ ప్రయోజనాల కోసమే దేశ ప్రజలపై ఈ ఇథనాల్ విధానాన్ని రుద్దుతున్నారని ఆరోపించారు. ఎవరూ భయపడకుండా E20కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ, దేశవ్యాప్తంగా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వానికి AAP పెట్టిన 3 డిమాండ్లు
ప్రశ్నించే వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంపై కేజ్రీవాల్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ‘మేము చదువుకున్న వాళ్లం, మా డిగ్రీలు అసలైనవి’ అని వ్యాఖ్యానించిన ఆయన, పెట్రోల్-డీజిల్ వాహనాలు కొనడం ఆపి, ఎలక్ట్రిక్ వాహనాలను ఎంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం ముందు ప్రధానంగా మూడు డిమాండ్లు ఉంచారు.
ప్రతి పెట్రోల్ బంకులో సాధారణ పెట్రోల్ లేదా E20 పెట్రోల్ ఎంచుకునే వెసులుబాటు వినియోగదారుడికి ఉండాలన్నారు. ప్యూర్ పెట్రోల్‌తో పోలిస్తే E20 పెట్రోల్ ధర తక్కువగా ఉండాలని.. పెట్రోల్ లీటర్ ధరను రూ. 84కు తగ్గించాలని డిమాండ్ చేశారు.
Also Read: ఇక ఆగేదే లేదు.. అభివృద్ధిలో తెలంగాణ సరికొత్త రికార్డు!