Telangana Land: తెలంగాణలో భూముల అంశం ప్రకంపనలు సృష్టించింది. అసెంబ్లీ వేదికగా.. ధరణి నుంచి 22A అంశం వరకు సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబ భూముల వివరాలను బయటపెట్టిన సీఎం.. ఆ భూములపై విచారణకు ఆదేశించారు. దీంతో మాజీ సీఎం కుటుంబ భూములపై ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చ మొదలైంది.
ధరణి, 22A భూముల అంశంపై అసెంబ్లీలో సుమారు 4గంటల పాటు సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు. ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన భూముల అంశాన్ని కూడా సీఎం సభలో ప్రస్తావించారు. బినామీ భూముల వ్యవహారాలపై పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తామని తెలిపారు. భూ రికార్డులు, రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఎర్రవల్లి ఫాంహౌస్ భూముల వ్యవహారంపై విచారణ జరిపి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Also read: సూడాన్‌లో విషాదం.. కూలిన బంగారు గని.. 67 మంది దుర్మరణం!
ఇదే సమయంలో 22A నిషేధిత భూముల సమస్య పరిష్కారానికి హైపవర్ ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. అర్హులైన ప్రజల సమస్యలు పరిష్కరించడంతో పాటు భూ వ్యవహారాల్లో పారదర్శకత తీసుకువస్తామని స్పష్టం చేశారు. మొత్తంగా అసెంబ్లీ వేదికగా భూముల అంశం రాజకీయ వేడిని పెంచింది. ధరణి నుంచి 22A వరకు.. గత భూ వ్యవహారాలపై ప్రభుత్వం దూకుడు పెంచడంతో తెలంగాణ పాలిటిక్స్‌లో కొత్త చర్చ మొదలైంది.
Also read: హైదరాబాద్‌లోనే ఫారిన్ ఫీలింగ్.. ఇక్కడ అడుగు పెడితే 85 దేశాల అందాలు చూసేయొచ్చు!