BigTV English

Ayodhya Consecration | ప్రాణ ప్రతిష్ఠ వేళ.. పఠించాల్సిన మంత్రాలు ఇవే..!

Ayodhya Consecration | మర్యాదా పురుషోత్తముడైన రాముడు.. బాలరాముడి రూపంలో రేపు అయోధ్య ఆలయంలో వైభవంగా కొలువుదీరనున్నాడు. దీంతో దేశంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాలు రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి.

Ayodhya Consecration | ప్రాణ ప్రతిష్ఠ వేళ.. పఠించాల్సిన మంత్రాలు ఇవే..!

Ayodhya Consecration | మర్యాదా పురుషోత్తముడైన రాముడు.. బాలరాముడి రూపంలో రేపు అయోధ్య ఆలయంలో వైభవంగా కొలువుదీరనున్నాడు. దీంతో దేశంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాలు రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి. ధర్మానికి, కరుణకు, కర్తవ్యానికి ప్రతిరూపమైన రాముడు ఆలయంలో కొలువుదీరే వేళ.. రామ భక్తులంతా కొన్ని రామనామాలను జపించాలని పండితులు సూచిస్తున్నారు. దీనివల్ల భయాలు, కష్టాలు తీరతాయని వారు చెబుతున్నారు. వాటి వివరాలు..


నాడు వాల్మీకి మహర్షి జపించిన ‘రామ’ అనే మంత్రాన్ని రేపు జపించాలని పండితులు చెబుతున్నారు. సులభంగా పలకదగిన, అమోఘ ఫలితాన్నిచ్చే ఈ రామనామ జపంతో గొప్ప హృదయపరివర్తన, చైతన్యం కలుగుతాయి.

ఇక రెండవది.. శ్రీరామ శరణమ్. ‘ఓ రామా.. నేను నిన్ను శరణు వేడుతున్నాను’ అనే అర్థం వచ్చే ఈ మంత్ర జపంతో భక్తులకు ఉన్న ప్రతికూలతలు, సమస్యలు, అడ్డంకులు తొలగిపోతాయిని, గొప్ప మానసిక ప్రశాంతత చేకూరుతుంది.


ఇక మూడవది.. బీజ మంత్రం. ‘ఓం రాం రామాయ నమః’ మంత్రాన్ని రేపు జపించటం వల్ల కష్టాలు తొలగి రాముని అనుగ్రహం కలిగి సానుకూల ఫలితాలను పొందుతారు. ఎనలేని ఉత్సాహం, ధైర్యం కూడా చేకూరుతుంది.

ఈ వరుసలో నాల్గవ మంత్రం.. రామ గాయత్రీ మంత్రం. ‘ఓం దాశరథయే విద్మహే.. సీతావల్లభాయ ధీమహి.. తన్నో రామ ప్రచోదయాత్’ అనే ఈ మంత్ర జపంతో శారీరక, మానసిక దృఢత్వం, రాముని అనుగ్రహంతో మంచి మార్గంలో నడిచే శక్తి చేకూరతాయి.

రేపు పఠించాల్సిన ఐదవ మంత్రం.. ‘శ్రీరామ్ జయ రామ కోదండ రామ’. రాముని పరాక్రమాన్ని, విజయాన్ని సూచించే ఈ మంత్ర జపంతో భక్తుల్లో గొప్ప ధైర్యాన్ని నింపుతుందని, ధర్మమార్గంలో నడిచే నైతిక శక్తినిస్తుందని చెబుతారు.

రేపటి రోజు జపించాలని పండితులు చెబుతున్న ఆరవ మంత్రం.. విష్ణు మంత్రం. ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’ అనే ఈ మంత్రం జపిస్తే.. సాక్షాత్తూ విష్ణు అవతారమైన రామయ్య.. తన భక్తులకు అపారమైన శక్తినిస్తాడు.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×