BigTV English

Ayodhya Ram Mandir : అయోధ్య విశేషాలివే..!

Ayodhya Ram Mandir : అయోధ్య విశేషాలివే..!

Ayodhya Ram Mandir : అయోధ్యకు తరలివచ్చే భక్తులకు పంచేందుకు ప్రసాదం సిద్ధమవుతోంది. ప్రాణప్రతిష్ట రోజు భక్తులకు ఇచ్చేందుకు 45 టన్నుల లడ్డూలను తయారు చేస్తున్నారు ట్రస్ట్ అధికారులు. గుజరాత్, వారణాసిలలోని స్వీట్స్ తయారీదారులకు ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపింది. స్వచ్ఛ మైన దేశీ నెయ్యితో తయారు చేయిస్తున్న ఈ లడ్డూలను రాముడికి ప్రసాదంగా అర్పించాక, భక్తులకు పంచిపెట్టనున్నట్లు తెలిపింది అయోధ్య టెంపుల్ ట్రస్ట్.


అయోధ్య హట్
అయోధ్య హట్ పేరుతో భక్తుల కోసం వివిధ ఏర్పాట్లు చేస్తోంది అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ. ఫుడ్‌ కోర్టులతో పాటు భక్తుల కోసం కొన్ని తాత్కాలిక రూమ్‌లను సిద్ధం చేస్తున్నారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తర్వాత దీనిని ఘాట్‌గా అభివృద్ధి చేసి హరతి కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

అయోధ్య స్వచ్ఛ అభియాన్‌
అయోధ్య రాముడి ప్రతిష్టాపనకు తన వంతుగా స్వచ్ఛ అభియాన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉత్తరప్రదేశ్‌ మంత్రి సురేశ్‌ ఖన్నా. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుకు అనుగుణంగా తాను ఈ కార్యక్రమం చేపట్టినట్టు ఆయన తెలిపారు. ప్రధాని మోడీ కూడా మహారాష్ట్రలోని కాలారామ్ ఆలయంలో స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపట్టారు.


అయోధ్య సోలార్ స్ట్రీట్‌ లైట్స్‌
అయోధ్య సరికొత్త రికార్డ్‌ సృష్టించేందుకు సిద్ధమంది. గుప్తర్‌ ఘాట్‌ నుంచి నిర్మలీ కుండ్‌ మధ్య ఉన్న 10 కిలోమీటర్ల దూరంలో ఏకంగా 470 సోలార్ స్ట్రీట్‌ లైట్స్‌ను ఏర్పాటు చేశారు అధికారులు. ఇది ప్రపంచంలోనే అత్యధికమని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన 70 శాతం పనులు పూర్తయ్యాయి. మొత్తం పూర్తైతే సరికొత్త రికార్డ్‌ను సృష్టించడం ఖాయం.

అయోధ్య బీహార్‌ రైస్
రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి బీహార్‌ ప్రత్యేకమైన గోవింద్ భోగ్ బియ్యాన్ని పంపారు. శ్రీరాముడికి సమర్పించే ప్రసాదంలో ఈ ధాన్యాన్ని ఉపయోగించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ దాన్యాన్ని రాముల వారి కోసం ఉచితంగా అందిస్తామన్నారు.

అయోధ్య రాముడికి కానుకలు
అయోధ్య రాముడికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. అయోధ్యలోని అమావ మందిర్‌ కర్ర, ఇంకా బంగారంతో రూపొందించిన రెండున్నర కిలోల బరువున్న ధనస్సును కానుకగా ఇచ్చింది. చెన్నైలో తయారైన ఈ ధనస్సును ఈ నెల 19న ట్రస్ట్‌కు అప్పగించనుంది. ఇందులో 700 గ్రాముల బంగారాన్ని ఉపయోగించారు. అయితే దీనికెంత ఖర్చు అయ్యిందన్నది మాత్రం ఆలయ అధికారులు వెల్లడించలేదు.

అయోధ్య సాధు దీపావళి
అయోధ్యలో భక్తుల వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అయోధ్యకు చేరుకున్న సాధువులు దీపావళిని చేసుకున్నారు. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న ఈ సమయమే అసలైన దీపావళి అంటున్నారు సాధువులు.

అయోధ్య సాధు నగరం
అయోధ్యు వచ్చే సాధువుల కోసం ఓ కృత్రిమ నగరాన్ని సృష్టించారు అధికారులు. తాత్కాలిక విడిది కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఉచితంగా ఉపయోగించుకునేందుకు విడిదిని ఏర్పాటు చేశారు. అన్నింటిలో విద్యుత్ ఏర్పాట్లను కూడా చేశారు.

.

.

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×