BigTV English

Bharat dojo Yatra: త్వరలోనే భారత్ డోజో యాత్ర.. వీడియో షేర్ చేసిన రాహుల్ గాంధీ.. వివరాలిదిగో..

Bharat dojo Yatra: త్వరలోనే భారత్ డోజో యాత్ర.. వీడియో షేర్ చేసిన రాహుల్ గాంధీ.. వివరాలిదిగో..

Bharat dojo Yatra: లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్రను కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఈ జోడో యాత్రను రెండు దఫాలుగా నిర్వహించారు. మరోసారి కూడా యాత్రను నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. త్వరలోనే యాత్ర ఉంటుందని, దాని పేరు డోజో యాత్ర అంటూ రాహుల్ గాంధీ ఓ వీడియోను షేర్ చేశారు.


అయితే, రెండు దఫాలుగా ఈ యాత్రను నిర్వహించింది. మొదటగా భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ జోడో యాత్రలో రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నేతలు పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అదేవిధంగా రెండో దఫా భారత్ జోడో న్యాయ్ యాత్రపేరిట పాదయాత్రను నిర్వహించారు. ఈ న్యాయ్ యాత్రను తూర్పు భారతం నుంచి పశ్చిమ భారతం వైపు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమ శిబిరాల వద్ద జరిగిన మార్షల్ ఆర్ట్స్ సెషన్లకు సంబంధించిన వీడియోను తాజాగా రాహుల్ గాంధీ షేర్ చేశారు. అలాగే త్వరలో భారత్ డోజో యాత్ర రాబోతుంటూ అందులో వ్యాఖ్యానించారు. అయితే, మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణనిచ్చే కేంద్రాలను డోజో అని పిలుస్తారు. ఈ యాత్రకు డోజో యాత్ర అని పేరు పెట్టారు.

Also Read: ‘రాజీ ప్రసక్తే లేదు’.. ప్రభుత్వంలో ఉంటూనే నిరసన చేస్తున్న అజిత్ పవార్..


ఇదిలా ఉంటే.. గత భారత్ జోడో యాత్రలు విజయవంతమయ్యాయి. రాహుల్ గాంధీకి ఈ యాత్రలో పాల్గొన్న అనంతరం మంచి గుర్తింపు వచ్చిందని చెబుతుంటారు. వాటి ఫలితమే ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధిక సీట్లను ప్రజలు కట్టబెట్టారంటున్నారు. సెప్టెంబర్ 2022 నుంచి జనవరి 2023 వరకు మొదటి భారత్ జోడో యాత్రను నిర్వహించారు. కన్యాకుమారి నుంచి ఈ యాత్ర ప్రారంభమయ్యింది. కాశ్మీర్ లో విజయవంతంగా ముగిసింది. ఈ యాత్ర మొత్తం 71 లోక్ సభ నియోజకవర్గాల్లో కొనసాగింది. తెలంగాణలో కూడా ఈ యాత్ర కొనసాగింది. భారత్ జోడో యాత్రలో చాలామంది ప్రముఖులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజల నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నిర్వహించిన ఈ యాత్రలో ప్రతి లోక్ సభ నియోజకవర్గంలో ఉన్న ప్రజల సమస్యలను రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా అప్పుడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంపై ప్రజల ఒపీనియన్ ఏంటి..? తాము అధికారంలో వస్తే ఎలాంటి విధానాలను అమలు చేయాలి..? పరిపాలన ఏ విధంగా ఉండాలి.. చివరకు ప్రజలు ఏం కోరుకుంటున్నారు..? అనే అంశాలను రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఫీడ్ బ్యాక్ తీసుకుంది. ప్రజల నుంచి ఈ యాత్రకు మంచి రెస్పాన్స్ రావడమే కాదు.. జోడో యాత్ర జరిగినన్నాళ్లు దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచింది. రాహుల్ పై ప్రశంసల వర్షం కురిసింది.

Also Read: ఇండియన్ ఆర్మీ చేతికి మరో బ్రహ్మాస్త్రం.. వీటి ప్రత్యేకతలు ఇవే..!

ఆ తరువాత నిర్వహించిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ యాత్రను 2024 జనవరి 14న మణిపూర్ లోని తౌబాల్ జిల్లాలో ప్రారంభించారు. అలా ప్రారంభమైన యాత్ర మార్చి 16న ముంబైలో ముగిసింది. మొత్తం 100 లోక్ సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ సెగ్మెంట్లు, 110 జిల్లాల పరిధిలో 6,713 కిలో మీటర్ల వరకు ఈ యాత్రను నిర్వహించారు. ఈ యాత్రలో కూడా ప్రజలు, ప్రముఖులు భారీగా పాల్గొన్నారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×