Supreme Court: భారత్ లో పోర్నోగ్రఫీ బ్యాన్ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మైనర్లు పోర్నోగ్రఫీ యాక్సెస్ చేయడాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ విధానాన్ని రూపొందించేలా ఆదేశించాలని పిటిషనర్ కోర్టును కోరారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో అశ్లీల కంటెంట్‌ను వీక్షించడాన్ని పరిమితం చేయాలని పిటిషనర్ కోరారు. డిజిటలైజేషన్ తర్వాత, ప్రతి ఒక్కరూ డిజిటల్‌గా కనెక్ట్ అవుతారని, ప్రతిదీ ఒక్క క్లిక్ లో లభిస్తుందన్నారు.
కోవిడ్ సమయంలో పిల్లలు పాఠశాల విద్య కోసం డిజిటల్ పరికరాలను ఉపయోగించాల్సి వచ్చిందని గుర్తించారు. అయితే అటువంటి సమయాల్లో అశ్లీల కంటెంట్‌ను నిరోధించడానికి లేదా పర్యవేక్షించడానికి సమర్థవంతమైన వ్యవస్థలు లేవని పిటిషనర్ వాదించారు. భారత్ లో బిలియన్ల అశ్లీల వెబ్‌సైట్‌లు అందుబాటులో ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. అశ్లీల వెబ్ సైట్ లను నియంత్రించడానికి సమర్థవంతమైన చట్టం అవసరం అన్నారు. ముఖ్యంగా 13-18 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతపై అశ్లీలత ప్రభావం చూపకుండా అదుపు చేయాల్సి ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు.
భారత్ లో 20 కోట్లకు పైగా అశ్లీల క్లిప్‌లు, మైనర్ల లైంగిక విషయాలు ఆన్ లైన్లో అందుబాటులో ఉన్నాయని పిటిషనర్ తన పిటిషన్ లో తెలిపారు. అటువంటి కంటెంట్ యాక్సెస్‌ను నిరోధించడానికి సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 69A కింద కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయని కోర్టుకు తెలియజేశారు. తల్లిదండ్రులు ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి పిల్లలు ఆన్‌లైన్‌లో ఏమి చూస్తారో పర్యవేక్షించవచ్చని, పరిమితం చేయవచ్చని గతంలో కోర్టులు తెలిపాయన్నారు. ఈ పిటిషన్ పై ముందు విచారణకు నిరాకరించినా, పిటిషనర్ వాదనాల్లో తీవ్రతను అంగీకరించి సుప్రీంకోర్టు విచారణను అంగీకరించింది.
ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొన్ని నెలల క్రితం నేపాల్ ప్రభుత్వం అనేక సోషల్ మీడియా సైట్లను నిషేధించింది. అనంతరం ఆ ప్రభుత్వంలో అవినీతి పేరుకుపోయిందని, ప్రభుత్వాన్ని కూలదోసేందుకు నేపాల్ జెన్-జెడ్ హింసాత్మక ఆందోళనలు చేశారు. భారత్ లో పోర్నోగ్రఫీ నిషేధంపై పిటిషన్‌ను నాలుగు వారాల తర్వాత విచారించడానికి సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ అంగీకరించింది. అయితే నవంబర్ 23న పదవీ బీఆర్ గవాయ్ విరమణ చేయనున్నారు.
Also Read: Supreme Court: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన రాష్ట్రాల సీఎస్‌లు
అశ్లీల చిత్రాలను పూర్తిగా నిషేధించాలని దాఖలైన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు తాము ప్రస్తుతం సిద్ధంగా లేమని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది. నేపాల్‌లో సోషల్ మీడియా నిషేధంపై ఏమి జరిగిందో చూడండి అని వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాపై ఆంక్షలు విధించిన తర్వాత జరిగిన హింసాత్మక నిరసనలను ప్రస్తావించింది. జెన్-జెడ్ వీధుల్లోకి వచ్చి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని తెలిపింది.