Bihar Politics: బీహార్‌లో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తోంది? మరోసారి ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందా? లేకుంటే ఇండియా కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారా? ఇదిలాఉండగా ఓ నేత హత్య కేసులో అధికార పార్టీకి చెందిన జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ అరెస్టు కావడం కలకలం రేపుతోంది. అసలేం జరుగుతోంది?
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ హత్యలు
బీహార్‌లో తొలి విడత ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ క్రమంలో నేతల హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిశోర్ మద్దతుదారు దులార్‌చంద్ యాదవ్ హత్యకు గురి కావడం హాట్ హాట్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. దులార్ హత్య కేసులో సీఎం నీతీశ్‌కుమార్ పార్టీ నేత, ప్రస్తుత అభ్యర్థి అనంత్‌సింగ్‌ను అరెస్టు చేశారు పోలీసులు.
పాట్నాజిల్లాలో మొకామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీయూ అభ్యర్థిగా బరిలో ఉన్నారు అనంత్‌సింగ్. దులార్ హత్య తర్వాత అందరి చూపు అధికార పార్టీపై పడింది. ఈ నేపథ్యంలో పోలీసులు అనంత్‌పై ఫోకస్ చేశారు. వివరాలు సేకరించిన పోలీసులు, ఆదివారం వేకువజామున ఆయన ఇంట్లో అరెస్టు చేశారు. అనంత్ తోపాటు ఇద్దరు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఒకరు మణికాంత్ ఠాకూర్, మరొకరు రంజీత్ రామ్. ఈ కేసులో ఈ ముగ్గుర్ని విచారించేందుకు వారిని పట్నాకు తరలించారు అధికారులు.
అసలు హత్య ఎలా జరిగింది?
మొకామా నియోజకవర్గంలో జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి పీయూష్ ప్రియదర్శి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార జేడీయూ-జన్‌సురాజ్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో పీయూష్ మామ దులార్ చంద్‌పై దుండగులు కాల్పులు జరిపారు. స్పాట్‌లో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే పోలీసులు అతడ్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. దులార్ బాడీకి పోస్టుమార్టం చేశారు.
ALSO READ: శబరిమల బంగారం వివాదంలో కొత్త ట్విస్ట్.. ఎంత చోరీ అయ్యిందంటే
బుల్లెట్ కారణంగానే అతడు మృతి చెందినట్లు తేలింది. జన్ సూరజ్ పార్టీ నేత హత్య నేపథ్యంలో ఆగ్రహానికి గురైన ఆ పార్టీ మద్దతుదారులు రెచ్చిపోయారు. ఆర్జేడీ మొకామా అభ్యర్థి వీణా దేవీ కారుపై రాళ్లు రువ్వడంతో ఈ పరిణామం బీహార్‌లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌పై నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
అల్లర్ల నివారించడంలో విఫలమైన పట్నా రూరల్ ఎస్పీ విక్రమ్ సిహాగ్‌ను బదిలీ చేసింది ఈసీ. అంతేకాదు మరో ముగ్గురు అధికారులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. బీహార్‌లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న మొదలుకానుంది.
#BREAKING: Former MLA and JDU candidate Anant Singh from Mokama arrested by Patna SSP Kartikey Sharma’s team from Barh. He is being brought to Patna under tight security in Mokama murder case.#BiharElection2025 #AnantSingh #Bihar #JDU pic.twitter.com/0qxOIULD7B
— Bishwajeet Maurya (@bishwamaurya_) November 1, 2025