Student Jumps from 4th floor: రాజస్థాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. జైపూర్ లోని ఓ స్కూల్ 4వ అంతస్తు నుంచి 12 ఏళ్ల విద్యార్థిని దూకి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ విషాద సంఘటన తల్లిదండ్రులు, స్థానికులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది.
ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా మందలించడంతో బాలిక 4వఅంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పుకార్లు వినిపించాయి. వివరాళ్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని జైపూర్లోని నీర్జా మోడీ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని అమైరా 4వ అంతస్తు కిందపడి మరణించినట్లు పోలీసులు తలిపారు. ఈ సంఘటనపై ఇప్పుడే ఆత్మహత్యగా భావించలేమని అన్నారు. అదుపుతప్పి కింద పడినట్లుగా ప్రస్తుతానికి భావిస్తున్నామని పేర్కొన్నారు. నాల్గవ అంతస్తులోని రెయిలింగ్ పైకి విధ్యార్థిని ఎక్కినట్లుగా సీసీటీవీ వీడియోలో కనిపింస్తోందని, అదుపు తప్పి కిందపడినట్లుగానే తెలుస్తోందని అన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరూ ఉన్నట్లు కనిపించలేదన్నారు.
“ప్రాథమికంగా, ఆమె పడిపోతున్నట్లు ఎవరూ చూడలేదు. ఆమె కిందపడ్డ తరువాత అరుపు విన్న పాఠశాల సిబ్బంది గ్రౌండ్ ఫ్లోర్‌కు చేరుకుని ఆమెను తీవ్ర గాయాలతో చూశారు. ఆమె తలకు తీవ్ర గాయం అయి ఉండవచ్చు. బహుశా పడిపోవడం వల్లే కావచ్చు” అని ఏసీపీ కాకడే చెప్పారు.
వెంటనే స్పందించిన స్కూల్ యాజమాన్యం విద్యార్థినిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆమె అప్పటికే చనిపోయిందని వైద్యులు ప్రకటించారన్నారు. “ప్రమాదం కారణంగా బాలిక పక్కటెముకలు విరిగిపోయాయి. దీని వలన ఆమె ఇతర అవయవాలు దెబ్బతిన్నాయి ఈ కారణంగానే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని శవపరీక్ష కోసం పంపారు.” అని ఏసీపీ తెలిపారు. కాగా ఈ ఘటనపై ఇంకా ఎటువంటి కేసు నమోదు కాలేదని, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించిందని ఏసీపీ పేర్కొన్నారు.
ఈ ఘటనపై రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి మదన్ దిలావర్ స్పందించారు. “ఇది చాలా బాధాకర సంఘటన. ప్రమాదానికి గల కారణాలను, దర్యాప్తు చేసి నివేదిక పంపాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించాను. తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటాము” అని ఒక అధికారిక ప్రకటనలో అన్నారు.
స్కూల్‌పై నుంచి దూకి 6వ తరగతి విద్యార్థిని మృతి
రాజస్థాన్ రాజధానిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జైపూర్ లోని నీర్జా మోడీ స్కూల్ ఐదో అంతస్తు నుంచి దూకి 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని అమైరా (12) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.… pic.twitter.com/S2pfmEYRTK
— ChotaNews App (@ChotaNewsApp) November 2, 2025