Bihar Elections: బిహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటకలలో బీజేపీ భారీ ఎన్నికల మోసానికి పాల్పడిందని, ఇప్పుడు బీహార్‌లోనూ ఓటర్ల జాబితాల నుండి పేర్లను తొలగిస్తూ అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించారు. 56 అంగుళాల ఛాతీ ఉందని చెప్పుకునే మోదీ నిజానికి పిరికివాడని ఆయన అన్నారు. అదానీ, అంబానీలు ప్రధాని మోదీతో కుట్ర పన్నారని, ప్రధాని కూడా వారికి భయపడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
మహాత్మా గాంధీ శారీరకంగా బలంగా ఉండకపోవచ్చు కానీ ఆయన ఎప్పుడూ బ్రిటిష్ వారికి భయపడలేదని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధానమంత్రి ఇందిరా గాంధీని కూడా అమెరికా బెదిరించడానికి ప్రయత్నించిందని, కానీ ఆమె ఎప్పుడూ చలించలేదని ఆయన అన్నారు. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో, యుద్ధాన్ని ఆపమని అమెరికా నావికాదళం ఆమెపై ఒత్తిడి తెచ్చింది. కానీ ఆమె “మీకు నచ్చింది చేయండి. కానీ మేము వెనక్కి తగ్గలేము” అని నిరాకరించినట్లు రాహుల్ గుర్తు చేశారు.
READ ALSO: Perplexity: చాలా మందికి తెలియని రాజకీయ నాయకుల “గుట్టును” బయటపెట్టబోతున్న పెర్‌ప్లెక్సిటీ AI
బీహార్‌లో మహా కూటమి గెలుస్తోందని, అయినప్పటికీ ప్రజలు తమ పోలింగ్ బూత్‌ల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ఓటును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. “ప్రజాస్వామ్యంలో మీ ఓటు మీ అత్యంత శక్తివంతమైన ఆయుధం” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదే ప్రచార పర్యటనలో భాగంగా, రాహుల్ బెగుసరాయి ప్రాంతంలో సరదాగా గడిపారు. స్థానిక అభ్యర్థి ముఖేష్ సహానీతో కలిసి ఆయన ఓ చెరువులోకి దిగి ఈత కొట్టారు. అనంతరం మత్స్యకారులతో కలిసి చేపలు పడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సరదాగా రాహుల్ గాంధీ.. చెరువులో దిగి..
బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బెగుసరాయి ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి అభ్యర్థి ముకేశ్ సహానీతో కలిసి ఓ చెరువులోకి దిగి రాహుల్ ఈతకొట్టారు. మత్య్సకారులతో కలిసి ఆయన చేపలు పట్టారు. ఈ సందర్భంగా… pic.twitter.com/1EkhQJywpu
— ChotaNews App (@ChotaNewsApp) November 2, 2025