E-Paper
Advertisement

Bihar Election Results: బీహార్ ఎన్నికల ఫలితాలు.. కీలక నేతల పరిస్థితి ఇదీ

Bihar Election Results: బీహార్ ఎన్నికల ఫలితాలు.. కీలక నేతల పరిస్థితి ఇదీ
Advertisement

Bihar Election Results: బీహార్ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో దూసుకుపోతుంది. మొత్తం 243 శాసనసభ స్థానాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు 183 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మహాగఠ్ బంధన్ 57 స్థానాలకు పరిమితం కాగా, ప్రశాంత్ కిశోర్ జన్ సురాజ్ పార్టీ 2 స్థానాల్లో ముందంజలో ఉంది.

కీలక నేతల పరిస్థితి ఇలా

బీహార్ ఎన్నికల ఫలితాల్లో కీలక నేతలు ముందంజలో ఉన్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ రాఘోపుర్ లో వెనుకబడ్డారు. మూడు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 1273 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి సతీశ్ కుమార్ ముందంజలో ఉన్నారు. లఖిసరాయ్ లో బీజేపీ నేత విజయ్ కుమార్ వెనుకంజలో ఉన్నారు. అలీనగర్ లో జానపద గాయని, బీజేపీ నేత మైథిలీ ఠాకూర్ ముందంజలో ఉన్నారు. మహువాలో జేజేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవన్ వెనుకంజలో ఉన్నారు. తారాపుర్ లో బీజేపీ నేత సామ్రాజ్ చౌదరీ ముందంజలో ఉన్నారు. మొకామాలో జేడీయూ నేత అనంత్ కుమార్ సింగ్ ముందంజలో ఉన్నారు. గయా పట్టణంలో బీజేపీ నేత ప్రేమ్ కుమార్, జముయ్ లో బీజేపీ నేత శ్రేయాసి సింగ్ ముందంజలో ఉన్నారు.

కీలక నియోజకవర్గాల్లో

  • తారాపూర్‌ లో బీజేపీ అభ్యర్థి, డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌదరీ ముందంజలో ఉన్నారు. అక్కడ ఆర్జేడీ నేత అరుణ్ కుమార్ వెనుకంజలో ఉన్నారు.
  • లఖిసరాయ్‌ లో బీజేపీ అభ్యర్థి, డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా వెనుకంజలో ఉన్నారు. అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి అమరేశ్ కుమార్‌ ముందంజలో ఉన్నారు.
  • సుపౌల్‌లో బీజేపీ అభ్యర్థి బిజేంద్ర ప్రసాద్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్‌ నేత మిన్నతుల్లాహ్‌ రహమానీ వెనుకంజలో ఉన్నారు.
  • కఠిహార్‌ నియోజకవర్గంలో బీజేపీ నేత తార్‌కిశోర్‌ ప్రసాద్‌ ముందంజలో ఉన్నారు.
  • కుటుంబ నియోజకవర్గంలో హిందుస్థానీ అవామ్‌ మోర్చా అభ్యర్థి లలన్‌రామ్ ముందంజలో ఉండగా, కాంగ్రెస్‌ నేత రాజేశ్‌ కుమార్ వెనుకబడ్డారు.
  • గయాటౌన్‌ లో బీజేపీ నేత ప్రేమ్‌కుమార్ ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్‌ నేత అఖౌరీ ఓంకార్ నాథ్ వెనుకబడ్డారు.

ప్రశాంత్ కిశోర్ కు షాక్

Advertisement

ప్రస్తుతం వెలువడిన ఫలితాల మేరకు బీజేపీ 81, జేడీయూ 75, ఎల్జేపీ(ఆర్వీ) 17, ఆర్జేడీ 39, కాంగ్రెస్ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. బీహార్ ఫలితాల్లో ప్రశాంత్ కిశోర్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తలిగింది. ప్రశాంత్ కిశోర్ జేఎస్పీ 200 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది.

Also Read: Bihar Election Result 2025: బీహార్‌లో రెండు చోట్ల MIM ఆధిక్యం

 12 గంటల వరకు ఈసీ అధికారిక లీడింగ్ వివరాలు ఇలా

  • జేడీయూ : 76
  • బీజేపీ : 85
  • ఆర్జేడీ : 33
  • కాంగ్రెస్ : 6
  • LJPRV (రాంవిలాస్ పార్టీ) : 22
  • హిందుస్తానీ ఆవామ్ మోర్చా పార్టీ : 5
  • సీపీఐ(ఎంఎల్) : 7

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×