E-Paper
Advertisement

Bihar Assembly Results: 500 కేజీల లడ్డూలు, 5 లక్షల రసగుల్లాలు.. బీహార్‌లో సంబరాలకు ఎన్‌డీఏ ఏర్పాట్లు

Bihar Assembly Results: 500 కేజీల లడ్డూలు, 5 లక్షల రసగుల్లాలు.. బీహార్‌లో సంబరాలకు ఎన్‌డీఏ ఏర్పాట్లు
Advertisement

Bihar Assembly Results: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. రేపు కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్డీఏ శిబిరంలో ఇప్పటికే వేడుకలు మొదలయ్యాయి. ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. రాజధాని పాట్నా సంబరాలకు సిద్ధమవుతుంది. భారీగా లడ్డూలు తయారీ, విందులకు సన్నాహాలు జరుగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు కృష్ణ సింగ్ కల్లు 500 కేజీల లడ్డూలకు ఆర్డర్ ఇచ్చారు. వీటిని ప్రధాని మోదీ, సీఎం నితీష్ కుమార్ చిత్రాలతో ఉన్న బాక్స్ ల్లో సిద్ధం చేస్తున్నారు. డయాబెటిస్ ఉన్న వారిని దృష్టిలో పెట్టుకుని తక్కువ షుగర్ తో స్వీట్లు తయారు చేస్తున్నారు.

ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ వైపే

“ఎగ్జిట్ పోల్ ఫలితాలు బీహార్ ప్రజలు, పార్టీ కార్యకర్తల కృషికి ప్రతిఫలం” అని కృష్ణ సింగ్ కల్లు అన్నారు. ఈసారి కూడా ఎన్డీఏ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జేడీయూ నేత అనంత్ సింగ్ పాట్నాలో 50,000 మందికి భారీ విందు ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఇక్కడ ఐదు లక్షల రసగుల్లాలు, గులాబ్ జామున్లను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

రేపే కౌంటింగ్

Advertisement

నవంబర్ 14న బీహార్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నప్పటికీ విజయం తమదేనని ఎన్డీఏ భాగస్వాములు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో పాట్నాలోని పండుగ వాతావరణం ప్రతిబింబిస్తుంది.

Also Read: Bengaluru: బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దారుణం: భార్యాభర్తలు, కుమారుడిపైకి కారు ఎక్కించి హల్‌చల్

Advertisement

ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కార్యకర్తలకు ఆహ్వానాలు అందుతున్నాయి. జేడీయూ నేత అనంత్ సింగ్ ప్రకటనలు, ఏర్పాట్లతో కార్యకర్తలలో ఉత్సాహం కనిపిస్తుంది. దులార్‌చంద్ హత్య కేసులో అనంత్ సింగ్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Related News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×