E-Paper
Advertisement

Bharat Jodo Nyay Yatra | భారత్ జోడో న్యాయ యాత్రలో హింస.. కీలక నాయకుడి కారుపై బిజేపీ దాడి!

Bharat Jodo Nyay Yatra | కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ల గాంధీ నాయకత్వంలో ఇటీవల భారత్ జోడో న్యాయ యాత్రం ప్రారంభమైంది. ఈ యాత్రలో జనవరి 20 ఆదివారం కాంగ్రెస్ సిబ్బంది, కీలక నాయకుడు జై రామ్ రమేశ్ కారుపై బిజేపీ కార్యకర్తలు దాడి చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు. ఈ ఘటన అస్సాం లోని సోనిత్‌పూర్ జిల్లాలో జరిగింది.

భారత్ జోడో న్యాయ యాత్ర నాలుగవ రోజున రాహుల్ గాంధీ అస్సంలోని బిస్వంత్ జిల్లా నుంచి బయలుదేరి సోనిత్‌పూర్ మీదుగా నాగావ్ చేరుకోవాలి. కాంగ్రెస్ బృందం నాగావ్ జిల్లా చేరుకొని అక్కడ రాహుల్ గాంధీ కలియబోర్‌లో ఒక ర్యాలీ నిర్వహించాల్సి ఉండగా.. అంతకుముందే బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని సమాచారం.

Advertisement

కాంగ్రెస్ నాయకులు కథనం ప్రకారం.. రాహుల్ గాంధీ వెళ్లే మార్గంలోనే బీజేపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఆ దారిలో కొందరు కాంగ్రెస్ నాయకుల వాహనాలు జాముగురిహట్ పక్క నుంచి వెళుతుండగా.. కొందరు బీజీపీ కార్యకర్తలు ఆ వాహనాలపై రాళ్లు విసిరారు. ఇందులో కాంగ్రెస్ అగ్రనేత జైరామ్ రమేష్ కారు కూడా ఉంది. ఈ దాడిలో కొందరు మీడియా రిపోర్టర్లు కూడా గాయపడ్డారు. బిజేపీ కార్యకర్తలు వారి కెమెరాలు లాక్కొని వాటిని ధ్వంసం చేశారని చెబుతున్నారు.

ఆ తరువాత కూడా బీజేపీ కార్యకర్తలు కార్లపై ఉన్న భారత్ జోడో యాత్ర పోస్టర్లను చింపేశారు. పైగా కార్ల వెనుక భాగంలో బీజేపీ జెండాలను పాతారు.ఇదంతా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్ శర్మ ఆదేశాలతోనే జరిగిందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది.

Advertisement

అయితే ఈ ఘటనపై విచారణ చేయాలని సిఎం హిమంత రాష్ట్ర డిజీపీకి ఆదేశాలు జారీ చేశారు.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×