BigTV English

Towel : టవల్ ఎన్ని రోజులకు ఉతుకుతున్నారు..?

Towel : మన నిత్యం జీవితంలో టవల్‌ ఎంతో అవసరమైనది. ముఖ్యమైనది కూడా. చేతులు శుభ్రం చేయడానికి, స్నానం చేయడానికి.. ఇలా ప్రతిసారి టవల్‌ని ఉపయోగిస్తుంటాం. కామన్‌గా చాలా మంది దుస్తులు కంపుకొడుతుంటేనో లేదా చెమటలో తడిస్తేనో మరకలు పడితేనో వెంటనే ఉతుకుతారు. లేదంటే కంగారేముందిలో తర్వాత ఉతికేద్దామని వాడేస్తుంటారు. ఇవన్నీ పక్కనబెటితో మరీ మనం రోజూ ఉపయోగించే టవల్ రోజూ ఉతకాలా? ఎన్ని రోజులకోసారి ఉతకాలి? అనే ప్రశ్నలు మన అందరిలోనూ ఉన్నాయి.

టవల్ చాడటానికి మనకు శుభ్రంగా కనిపించినా.. రోజులు గడిచే కొద్ది అందులో లక్షల క్రిములు చేరుతాయి. ఫలితంగా దాన్ని ఉపయోగించేవారిలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. టవల్‌ను ఎప్పటికప్పుడు ఉతకడం మంచిది. లేదంటే దానిపై సూక్ష్మ జీవులు పెరిగిపోతాయి. ఒక్క ఉతుకులో వాటన్నింటిని తొలగించడం కష్టం.

స్నానం చేశాక శరీర భాగాలను తుడిచేందుకు టవల్‌ను ఉపయోగిస్తాం. పాదాలు, చేతులు వంటివి తుడిచే క్రమంలో అక్కడుండే సూక్ష్మజీవులు టవల్‌‌కు అతుక్కుంటాయి. మన శరీరంపై ఉండే సూక్ష్మజీవులు హానికరమైనవి కాకపోవచ్చు. కానీ శరీరంపై గయాలైన ప్రాంతాల్లో సూక్ష్మజీవులు చేరితే వైరస్‌లు రావచ్చు.

ఒకే టవల్‌ను ఇద్దరు వాడుతుంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మన శరీరంపై ఉన్న సూక్ష్మజీవులు మనకు హాని కలిగించకపోయిన .. మనతో ఉన్న వారికి అనారోగ్యం కలిగించొచ్చు. ఇలా ఇద్దరు ఒకే టవల్‌ను వాడటం వలన వైరస్‌లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. అలానే మన దుస్తులతో కలిపి టవల్‌ను ఉతక్కూడదు.

ఒంటరిగా ఉంటుంటే.. మీరు రిస్క్ తక్కువే అని చెప్పాలి. అలాంటప్పుడు 15 రోజులకు టవల్‌ను ఉతకాలి. ముఖంపై మొటిమలు లేదా జుట్టు కుదుళ్లలో మంట గనుక ఉంటే టవల్‌నూ తరచూ ఉతికి వాడాలి. లేదంటే చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి. టవల్‌తో చెమటను తుడిచినప్పుడు ఎక్కువశాతం బాక్టీరియా చేరుతుంది. ఇలాంటప్పుడు టవల్ ఎక్కువ మురికిగా మారుతుంది. ఫేస్ టవల్, బాత్ టవల్ వేరువేరుగా ఉంటే మంచిది.

టవల్‌ను వినియోగించిన తరువాత సూర్యరశ్మి పడే ప్రాంతంలో ఆరవేయడం ఆరోగ్యకరమైన అలవాటు. టవల్‌ను నెలకోసారి వేడి నీళ్లలో ఉతకడం మర్చిపోకండి. వేడి నీళ్లలో ఉతకడం వల్ల టవల్ చాలా శుభ్రంగా ఉంటుంది.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×