India Pakistan War : ఇండియా పాకిస్తాన్ యుద్ధం ముగిసింది. ఆపరేషన్ సిందూర్ మాత్రం కంటిన్యూ అవుతోంది. వార్‌కు ఎండ్ కార్డ్ పడటంతో యావత్ భారతీయులు నిరుత్సాహపడుతున్నారు. పాక్ అంతు చూడాల్సిందేనని.. పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందేనని డిమాండ్లు చేస్తున్నారు. యుద్ధం ముగిసింది అని ప్రకటించినందుకే.. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీని, ఆయన కూతురుని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ రేంజ్‌లో రగిలిపోతున్నారు దేశభక్తులు. అయితే, భారత్ పాక్ యుద్ధం ముగియడంపై.. మనకంటే కూడా బలూచిస్తాన్ ఎక్కువ డిసప్పాయింట్ అవుతోంది. ఇదే ఛాన్స్ అనుకుని.. పాక్ నుంచి స్వాతంత్రం పొందుదామని చూసిన బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ ( BLF ) సందిగ్థంలో పడింది. ఇప్పుడేం చేయాలో అర్థం కాక.. ఇండియా ముందు ఓ ప్రపోజల్ పెట్టింది.
ఇండియాకు BLF రిక్వెస్ట్..
బలూచ్ కమాండర్ డాక్టర్ అల్లా నిజార్ భారత్ ముందు ఒక ప్రతిపాదన ఉంచాడు. 1971లో ఇండియా, పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాక్ ఓడిపోయింది. ఏకంగా 93,000 మంది పాకిస్తాన్ సైనికులు ఆయుధాలతో సహా ఇండియన్ ఆర్మీ ముందు లొంగిపోయారు. అయితే, ఆనాడు పాక్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆ 93వేల రైఫిళ్లను తమకు ఇవ్వమని అడుగుతున్నాడు BLF కమాండర్. ఒక్కో తుపాకీతో పాటు 10 బుల్లెట్లు కూడా ఇవ్వాలని కోరుతున్నాడు. అప్పుడు చూపిస్తాం పాకిస్తాన్‌కు తమ సత్తా ఏంటో అని అంటున్నాడు.
తమకేమీ అధునాతన ఆయుధాలు, క్షిపణులు, అణ్వాస్త్రాలు గట్రా అవసరం లేదంటున్నాడు. అంతర్జాతీయ జోక్యం కూడా అక్కర్లేదని చెబుతున్నాడు. జస్ట్, ఆనాటి పాత తుపాకులు 93,000 ఇస్తే చాలని అంటున్నాడు ఆ బలూచ్ కమాండర్. మిగిలిన వాటి సంగతి తాము చూసుకుంటామని సవాల్ చేస్తున్నాడు.
యుద్ధం ఆగడంతో..
పాపం.. BLF కమాండర్ చేసిన రిక్వెస్ట్ సమంజసంగానే ఉంది. అతనేమి ఇండియా నుంచి ఆయుధాలు కోరడం లేదు. తమ తరఫున పోరాడమని కూడా అడగడం లేదు. గతంలో పాకిస్తాన్ సైనికుల నుంచి స్వాధీనం చేసుకున్న పాత కాలం నాటి తమ తుపాకులే ఇప్పుడు తమకు తిరిగి ఇచ్చేయమంటున్నాడు. అంతే. అతని మాటల్లో ధైర్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పాక్‌తో పోరాడి గెలుస్తామని ధీమాగా ఉన్నారు. అలానే చేసేవారేమో. భారత్ పాక్ యుద్ధం కొనసాగి ఉంటే. మధ్యలోనే ఆగిపోవడం అందరికంటే బలూచిస్తాన్ ఆర్మీకే పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
Also Read : చైనా ఆయుధాలు చిత్తు.. పాక్‌కు బిగ్ డ్యామేజ్
BLA ఇప్పుడేం చేస్తుంది?
ఇప్పటికే భారత్‌కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ ( BLA ). ఇండియా అటునుంచి అటాక్ చేస్తే.. తాము పశ్చిమం నుంచి పాక్‌పై యుద్ధానికి దిగుతామని తెలిపింది. కాల్పుల విరమణ పాక్ వ్యూహాత్మక ఎత్తుగడ మాత్రమేనని.. ఆ మాటలు నమ్మొద్దని.. యుద్ధం చేయాలని ఇండియాను కోరింది. గడిచిన వారం రోజులుగా బలూచ్ ఫైటర్లు గెరిల్లా దాడులతో పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. మెరుపు దాడులతో 16 మంది పాకిస్తాన్ జవాన్లను హతమార్చాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని కీలక ప్రాంతాలపై తమ జెండాలను ఎగరేసి.. ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించాయి. ఇండియా పాకిస్తాన్ యుద్ధం మరికొన్నాళ్ల పాటు కొనసాగి ఉంటే.. బలూచిస్తాన్ పూర్తి స్థాయిలో స్వాతంత్య్రం పొందినా ఆశ్చర్యపోనవసరం లేదు అనేలా ఉండేది పరిస్థితి.
BLF Commander Dr. Allah Nizar has sought India's help to fight the Pakistani army that is illegally occupying Balochistan- just give us those 93000 guns of surrendered Pak soilders with 10/10 bullets pic.twitter.com/6bGiHcPvYV
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 12, 2025