Ravi Teja: మాస్ మహారాజ రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ భద్ర. ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేని సినిమా. దర్శకుడు బోయపాటి శ్రీను మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. అప్పట్లో ఈ సినిమా సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ని మెస్మరైజ్ చేశాయని చెప్పొచ్చు. ఈ సినిమాలో రవితేజ, మీరాజాస్మిన్ జంటగా నటించారు. నేటికి ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 సంవత్సరాలు పూర్తవుతుంది. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ కోసం బోయపాటి శ్రీను టాలీవుడ్ లో టాప్ హీరోస్ ని సెలెక్ట్ చేసి, చివరికి మూవీని రవితేజతో చేసినట్లు సమాచారం.. మరి బోయపాటి పక్కకు పెట్టిన ఆ హీరోలు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
ఛాన్స్ కొట్టేసిన రవితేజ..
హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న హీరో రవితేజ. మొదట్లో అనేక చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసినా ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ తరువాత శీను వైట్ల మూవీ ‘నీ కోసం’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీలో రవితేజ నటనకు మంచి ప్రశంసలు అందాయి. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. రవితేజ 2005లో వచ్చిన ‘భద్ర’ సినిమా అప్పట్లో రవితేజ కి మంచి క్రేజ్ తెచ్చిన మూవీ. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో టెలికాస్ట్ ఐతే మంచి రెస్పాన్స్ వస్తుంది. అంతేకాక ఈ మూవీలో ప్రతి పాట అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పట్లో ఈ మూవీ కోసం బోయపాటి శ్రీను మొదట కొంతమంది హీరోల దగ్గరికి వెళ్లి కథ వినిపించారు. టాలీవుడ్ బడా హీరోల దగ్గరికి వెళ్లి భద్ర మూవీ చేయడానికి ప్లాన్ చేశారుట బోయపాటి శ్రీను. అప్పట్లో ఆయన మొదటి మూవీ అవడంతో పెద్దగా ఎవరు ఆసక్తి చూపించలేదు. అయితే ఆయన కథ వినిపించిన హీరోలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ కు మొదట భద్ర స్టోరీ లైన్ చెప్పారు. అయితే బోయపాటి శ్రీను చివరికి రవితేజకి స్టోరీ వినిపించడం.. ఆయన వెంటనే ఓకే చేయడంతో, ఆయననే సెలెక్ట్ చేశారు బోయపాటి శీను. కొత్త డైరెక్టర్ తో మూవీస్ చేయడంలో రవితేజ ముందుంటారు. అప్పట్లో బోయపాటి శీను తన ఫస్ట్ ఫిలిం ‘భద్ర’ను రవితేజ తో చేయాలని అనుకోవడం. ఆయన ఓకే చెప్పేయడంతో ఈ మూవీ పట్టాలెక్కింది. ఈ సినిమా 2005 లో రిలీజ్ అయి రవితేజకు, బోయపాటి శ్రీను కి మంచి విజయాన్ని అందించింది.
భద్ర ఓ కల్ట్ క్లాసికల్ మూవీ ..
ఇక అప్పటికే రవితేజ మంచి ఫామ్ లో ఉన్న హీరో. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నాడు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఖడ్గం, ఇడియట్, అన్వేషణ, ఈ అబ్బాయి చాలా మంచోడు, అమ్మానాన్న తమిళ అమ్మాయి, దొంగోడు, వీడే, వెంకీ, నా ఆటోగ్రాఫ్, చంటి, వంటి చిత్రాలలో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అదే టైంలో కొత్త దర్శకుడిగా బోయపాటి శ్రీను పరిచయం అవుతూ భద్ర మూవీని రవితేజకి వినిపించడం, ఆయన ఓకే చెప్పడం జరిగిపోయింది. ఈ మూవీ అప్పట్లో సెన్సేషన్ అని చెప్పొచ్చు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో భద్ర క్యారెక్టర్ లో రవితేజ నటించారు. ఈ మూవీ మొత్తం రవితేజ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. 2005 మే 12వ తేదీన ఈ చిత్రం విడుదలైంది. రవితేజ మాస్ ఇమేజ్ ని మరింత పెంచిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీలో డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు మూవీకి ప్లస్ పాయింట్ గా నిలిచాయి. తెలుగు సినిమా అభిమానులకు ఓ కల్ట్ క్లాసికల్ గా ఈ మూవీ నిలిచిపోయింది. ఇప్పటికీ ఈ మూవీకి చాలామంది అభిమానులు ఫేవరెట్ మూవీగా కొనసాగుతుంది.
Vennela Kishore : ఆఫ్ట్రాల్ పాస్ పోర్ట్ కోసం మెగాస్టార్ మూవీనే వద్దనుకున్న వెన్నెల కిషోర్