BigTV English
Advertisement

Stones In Railway Track: రైలు పట్టాల మధ్య కంకర రాళ్లు.. ఎందుకో తెలుసా?

Stones In Railway Track: రైలు పట్టాల మధ్య కంకర రాళ్లు.. ఎందుకో తెలుసా?

Indian Railways: భారతీయ రైల్వే ఎంతగానో అభివృద్ధి చెందింది. ఒకప్పుడు నీటి ఆవిరితో నడిచిన రైళ్లు ఇప్పుడు విద్యుత్ సాయంతో పరుగులు తీస్తున్నాయి. గతంలో 60 నుంచి 100 కిలో మీటర్లతో ప్రయాణించిన రైళ్లు ఇప్పుడు ఏకంగా 180 కిలో మీటర్ల వరకు ప్రయాణిస్తున్నాయి. అయినప్పటికీ, రైలు పట్టాల విషయంలో ఇప్పటికీ కనిపించే కామన్ విషయం ట్రాక్స్ మధ్యలో కంకర రాళ్లు కనిపిస్తాయి. దేశంలో రైల్వే వ్యవస్థ ప్రారంభం అయిన నాటి నుంచి నేటి వరకు ట్రాక్స్ మధ్యలో కంకర రాళ్లు అనేవి కనిపిస్తూనే ఉన్నాయి. ఇంతకీ వాటిని ట్రాక్స్ మధ్యలో ఎందుకు వేస్తారు? అలా వేయడం వల్ల కలిగే లాభం ఏంటి? మెట్రో రైళ్లకు కంకర రాళ్లు వేయరు ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..


రైల్వే ట్రాక్స్ మధ్య కంకర రాళ్లు ఎందుకు?

నిజానికి రైల్వే ట్రాక్ వెంబడి, లోపల ఈ కంకర రాళ్లు వేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఈ రాళ్లను ట్రాక్ బ్యాలస్ట్ అంటారు. రైలు  చాలా బరువు ఉంటుంది. పెద్ద కంపార్ట్‌ మెంట్లతో రైలు పట్టాల మీద ప్రయాణం చేసినప్పుడు భారీ కంపనాలు వస్తుంటాయి. పెద్ద శబ్దంతో పాటు దగ్గర్లోని నిర్మాణాలు, భవనాలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ ప్రమాదం నుంచి కాపాడేందుకు ఈ కంకర రాళ్లను ఉపయోగిస్తోంది రైల్వేశాఖ. అంతేకాదు, రైలు పట్టాల మీద పిచ్చి మొక్కలు పెరగకుండా కంకర నిరోధిస్తుంది. వర్షాకాంలో రైలు పట్టాల మీద నీళ్లు నిలిచిపోకుండా ఈ కంకర కాపాడుతుంది. పట్టాల మీదికి వచ్చే వర్షం నీళ్లు కంకర నుంచి కిందికి వెళ్లి సమీపంలోని కాల్వలో లేదంటే మురుగు నీటి వ్యవస్థలో కలుస్తుంది.


రైళ్లు సాఫీగా ప్రయాణించేలా..

ఇక కంకర రాళ్లతో పాటు రైల్వే ట్రాక్ మీద పొడవైన కాంక్రీట్ ప్లేట్లు కూడా కనిపిస్తాయి. ఆ ప్లేట్స్ మీది నుంచే ట్రాక్స్ వేస్తారు. వీటిని స్లీపర్స్ అని పిలుస్తారు. రైల్వే ట్రాక్ బ్యాలస్ట్‌ లు కూడా ఈ స్లీపర్లకు గట్టిదనాన్ని అందించడంలో సాయపడుతాయి. రైలు ప్రయాణించే సమయంలో స్లీపర్, బ్యాలస్ట్ కలిసిపోయి బరువును భరిస్తాయి. ఫలితంగా ప్రమాదం సంభవించే అవకాశాన్ని తగ్గిస్తుంది. బ్యాలస్ట్ రైలు వెళ్లే సమయంలో ఏర్పడే కంపనాలను గ్రహిస్తుంది. ట్రాక్‌ మధ్యలో ఉన్న కంకర రైలు సాఫీగా ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది.

మెట్రో ట్రైన్ ట్రాక్స్ లో కంకర రాళ్లను ఎందుకు ఉపయోగించరు?

మెట్రో రైల్ ట్రాక్స్ విషయానికి వచ్చే సరికి బ్యాలస్ట్‌ కు బదులుగా బ్యాలస్ట్‌ లెస్ ట్రాక్‌ లను ఉపయోగిస్తారు. ఉదాహారణకు  కాంక్రీట్ స్లాబ్‌లు, తారును వాడుతారు. బ్యాలస్ట్‌ లెస్ ట్రాక్‌ లు, మరింత దృఢంగా ఉండటం వలన, బ్యాలస్ట్ కంటే కంపనాలు, శబ్దాన్ని బాగా తగ్గిస్తాయి. మెట్రో సొరంగాలు, ఎత్తైన నిర్మాణాల మీదుగా వెళ్తూ పరిమిత స్థలాన్ని కలిగి ఉంటాయి. బ్యాలస్ట్‌ లెస్ ట్రాక్‌ లకు తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. అధిక రైలు ఫ్రీక్వెన్సీ, ఎక్కువ షెడ్యూల్స్ కలిగిన మెట్రో వ్యవస్థలకు కంకర రాళ్లు అంతగా అనుకూలంగా ఉండవు.బ్యాలస్ట్‌ లెస్ ట్రాక్‌ లు ప్రారంభంలో ఎక్కువ ఖర్చులను కలిగి ఉన్నప్పటికీ, వాటి మెయింటెనెన్స్ ఖర్చు చాలా తక్కుగా ఉంటుంది. అందుకే, కంకర రాళ్లను మెట్రో రైల్ ట్రాక్స్ లో వినియోగించరు.

Read Also: బుల్లెట్ ట్రైన్ కు ముహూర్తం ఫిక్స్.. పరుగులు పెట్టేది ఆ రోజు నుంచే!

Related News

Hyderabad: శంషాబాద్‌‌లో విమానాల రాకపోకలు ఆలస్యం.. 200 మంది ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు

Vande Bharat: వందే భారత్ రైలు జర్నీకి బ్రిటన్ దంపతులు ఫిదా, అల్లం చాయ్ అదుర్స్ అంటూ..

Free Travel: అక్కడ బస్సు, రైళ్లలో పిల్లలు పుడితే.. వారికి లైఫ్ టైమ్ జర్నీ ఫ్రీ!

Miniature Train: ఇది దేశంలోనే తొలి సోలార్ పవర్ ట్రైన్.. ఎక్కడ నడుస్తుందో తెలుసా?

IRCTC Packages: రామేశ్వరం నుంచి అయోధ్య వరకు.. భారత గౌరవ్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర

Shocking Video: ఎక్కువ ధర ఎందుకన్న ప్రయాణీకుడు, చితక బాదిన క్యాటరింగ్ సిబ్బంది, వీడియో వైరల్!

Vande Bharat Trains: నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాలకు?

Nashik Tour: నాసిక్ టూర్.. ఈ ప్లేస్‌లు జీవితంలో ఒక్కసారైనా చూడాలి మావా !

Big Stories

×