E-Paper
Advertisement

ప్రయాణికుడిపై ఓ కండక్టర్ ప్రతాపం.. మండిపడిన నెటిజన్స్, కండక్టర్ సస్పెండ్

ప్రయాణికుడిపై ఓ కండక్టర్ ప్రతాపం.. మండిపడిన నెటిజన్స్, కండక్టర్ సస్పెండ్
Advertisement

Bus Conductor: ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఓ బస్సు ఎక్కేందుకు ప్రయత్నించాడు ప్యాసింజర్. సదరు వ్యక్తిపై కండక్టర్ అత్యంత అమానుషంగా వ్యవహరించాడు. కాలుతో తన్ని బస్సు నుంచి కిందికి తోసేశాడు.  దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఇంటాబయటా విమర్శలు రేగడంతో సదరు కండక్టర్‌ని సస్పెండ్ చేశారు. ఈ ఘటన బెంగుళూరు సిటీలో వెలుగుచూసింది.

 

బెంగుళూరు సిటీలో షాకింగ్ ఘటన

Advertisement

ప్రయాణికుడిని బస్సు నుండి తోసి వేసిన ఘటన బెంగళూరులో సిటీ తీవ్ర కలకలం రేగడంతో బస్సు కండక్టర్ సస్పెండ్ అయ్యాడు. అతడిపై దాడి చేసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఆర్టీసీ తీరుపై విమర్శలు రేగడంతో పరిస్థితి గమనించిన బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్- BMTC అధికారులు సదరు కండక్టర్‌ను సస్పెండ్ చేశారు. శాఖాపరమైన విచారణకు ఆదేశించారు అధికారులు.

 

ప్రయాణికుడిపై కండక్టర్ ప్రతాపం

Advertisement

కర్ణాటక రాజధాని బెంగళూరులో మానవత్వాన్ని ప్రశ్నించేలా జరిగన ఓ ఘటన కలకలం రేపింది. ఆగస్టు 2న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన బస్సు ఎక్కేందుకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి. బస్సులో నుంచి ఆ వ్యక్తిని విచక్షణా రహితంగా కొట్టి, కాలుతో బస్సులో నుంచి కిందకు తోసేశాడు సదరు కండక్టర్.

 

సస్పెండ్ చేసిన అధికారులు, విచారణ మొదలు

దారుణ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ, ప్రయాణికులు, సామాన్యులు మొబైల్ కెమెరాల్లో రికార్టు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఈ వ్యవహారం బయటపడింది. అయితే బాధిత వ్యక్తి భిక్షాటన చేస్తూ జీవనం సాగించినట్టు తెలుస్తోంది.  నిరాశ్రయుడైన ఓ వ్యక్తి పట్ల రవాణా శాఖ సిబ్బంది క్రూరంగా ప్రవర్తించడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: మీనాక్షినటరాజన్ కేసులో బిగ్ ట్విస్ట్.. బీజేపీ ఎంపీలు, ఎన్నికల అధికారికి హైకోర్టు నోటీసులు జారీ..!

కర్ణాటక రవాణా శాఖ అధికారులు.. విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సదరు కండక్టర్‌ను తక్షణమే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఉదంతంపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. కండక్టర్ నుంచి వివరణ తీసుకున్నారు. అలాగే బాధిత వ్యక్తి నుంచి డిజిటల్ సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఆర్టీసీ అధికారులు.

 

 

Related News

రైతులను నెలకు రూ.3 వేలు పెన్షన్.. ఆ స్కీమ్ గురించి తెలుసా, వెంటనే అప్లై చేయండి?

రోడ్డుపై BMW బీభత్సం, స్పాట్‌లో ముగ్గురు మృతి, ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం

లాల్‌బాగ్ గణేష్ మండపం వద్ద ఘోర విషాదం.. చిన్నారితో సహా ఇద్దరు భక్తులు దుర్మరణం

భార్య ప్రైవేట్ పార్ట్స్ కొరికితే.. భర్త ముక్కు కొరికేశాడు, యూపీలో విచిత్రమైన ఘటన

రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసిన మహిళ .. TTEతో వాగ్వాదం, స్వయంగా బట్టలు చించుకుని

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. జలపాతంలోకి దూసుకెళ్లిన కారు, 8 మంది మృతి

భార్యకు మస్కా కొట్టి.. ప్రేయసితో మలేషియా ట్రిప్ ప్లాన్.. తీరా ఎయిర్‌పోర్టులో ఊహించని ట్విస్ట్!

దీదీకి దెబ్బ మీద దెబ్బ.. నందిగ్రామ్ తర్వాత రెజీనగర్‌లోనూ షాక్!

Big Stories

Advertisement
×