E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. ఇంట్లోంచి గేంటేసిన ప్రభావతి.. పాపం రోహిణి..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. ఇంట్లోంచి గేంటేసిన ప్రభావతి.. పాపం రోహిణి..
Advertisement

Gundeninda GudiGantalu Today episode August 6th : మనోజ్ ఏంట్రా ఇప్పుడు మాట్లాడట్లేదు నీలాగే మీ ఆవిడ కూడా లక్షల మింగేసిందా ఏంటి? నువ్వు మోసపోయావు అన్న సంగతి నీకు ఇప్పటికీ తెలియట్లేదా? రెండోసారి కూడా నువ్వు మోసపోయావ్ నీకు కట్టుకున్న భార్య నిన్ను దారుణంగా మోసం చేసింది అని బాలు మనోజ్ ని రెచ్చగొడతాడు.. ఆ మాట వినగానే మనోజ్ బయట వాళ్ళు నన్ను మోసం చేశారు అని అనుకున్నాను.. కానీ ఇంట్లోని వల్లే నా కట్టుకున్న భార్య నన్ను మోసం చేస్తుందని నేను ఊహించలేకపోతున్నాను. నా భార్య నన్ను ఇంత మోసం చేసింది అంటే నేను బ్రతికున్న వేస్ట్ అని మనోజ్ చాలా బాధపడిపోతాడు. కానీ రోహిణి మాత్రం నేను చేసిన తప్పేంటి అని అంటుంది.. ఒకవైపు మీనా ఇన్ని రోజులు నన్ను ఎన్నెన్నో మాటలు అన్నారు కదా ఇప్పుడు నీ పెద్ద కోడలు చేసిన నిర్వహణ ఏంటి అని ప్రభావతిపై రెచ్చిపోతుంది.. ఇక రోహిణి నోరు తెరవకుండా ప్రభావతి దిమ్మ తిరిగిపోయేలా చెంపలు వాయిస్తుంది.. నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అని అంటుంది ప్రభావతి కోపాన్ని చూసి ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు..

ప్రభావతి కోపానికి రోహిణి బలి..

ప్రభావతి చాలా కోపంగా రోహిణిని చంపలు వాయించేసి కొడుతుంది.. రోహిణి ఇంత మోసం చేస్తావా? నిన్ను ఇన్ని రోజులు నెత్తిన పెట్టుకొని చూస్తే నువ్వు ఇలాంటి మోసం చేసి మమ్మల్ని అందరినీ ఇలా బాధ పెడతావా.? డబ్బులు లేకపోయినా సరే అవి ఇవి అని నీచంగా మాట్లాడుతుంది ప్రభావతి. రోహిణిని దెబ్బ వదలకుండా కొడుతుంది మా ఆయన ఎంత చెప్తున్నా సరే ఎనకాల మందు ఆలోచించకుండా నిన్ను నా కొడుక్కి ఇచ్చి వాడి గొంతు కోశాను అని చాలా ఘోరంగా ప్రభావతి తిడుతుంది.. రోహిణి ఎంత చెప్తున్నా సరే అస్సలు వినకుండా ప్రభావతి రోహిణి పై రెచ్చిపోయి దెబ్బలు కొడుతుంది. రోహిణిని ఒక్క నిమిషం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్తుంది..

రోహిణిని ఇంట్లోంచి గేంటేసిన ప్రభా..

Advertisement

రోహిణిని ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని ప్రభావతి తెగేసి చెప్పేస్తుంది. రోహిణి ఎంత చెప్పాలని ప్రయత్నించినా సరే ప్రభావతి మాత్రం అస్సలు వినకుండా తనని ఇంట్లో నుంచి గెంటేయాలి అని అనుకుంటుంది. మీనా అలాగే శృతి ఎంతగా ఆపే ప్రయత్నం చేసినా కూడా ప్రభావతి మాత్రం అస్సలు వినకుండా నీలాంటి మోసగత్తేను నా ఇంట్లో ఉండనివ్వను.. నీలాంటిది నా ఇంట్లో ఉంటే నా ఇల్లు మొత్తం మోసాల పాలవుతుంది. మనోజ్ కూడా నేను మోసపోయాను నాకు ఇందులో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక రోహిణిని ప్రభావతి బయటికి తోసేసి గేటు వేసుకుని వస్తుంది.. రోహిణి ఎంత చెప్తున్నా కూడా అసలు వినకుండా బయట నిలబడి ఏడుస్తూ ఉంటుంది. రోహిణి ఇంకా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మిగిలిన వాళ్ళందరూ కూడా బయట నిలబడి బాధ పడిపోతూ ఉంటారు.

విద్యకు రోహిణి వార్నింగ్..

విద్య రోహిణి పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు విద్య ఇన్ని రోజులు రోహిణి చెప్పుకుంటున్న అబద్ధాలన్నీ ఆ మేక మాణిక్యం వల్ల బయటపడతాయేమో అని కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు రోహిణి పరిస్థితి ఎలా ఉందో ఏంటో ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు మెసేజ్ చేస్తే మెసేజ్ కి రిప్లై ఇవ్వడం లేదు.. అసలు తను ఎక్కడుందో ఏం చేస్తుందో అర్థం కావడం లేదు అని కంగారు పడిపోతూ ఉండగా అప్పుడే రోహిణి లోపలికి ఎంట్రీ ఇస్తుంది.. రోహిణి లోపలికి రాగానే ఏంటి పరిస్థితి అని అడుగుతుంది తను నిజం చెప్పగానే విద్యా కంగారు పడిపోతుంది. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వాళ్ళింటి పరువు పోతుందని కచ్చితంగా మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్తారు అని ధీమాగా ఉంటుంది.

మనోజ్ కు పిచ్చి పట్టిందా..?

Advertisement

మనోజ్ వెర్రివాడు లాగా అన్ని పిచ్చిపిచ్చిగా చూస్తూ కిందకి వస్తాడు. మనోజ్ చేస్తున్న ప్రవర్తన అతని చూపులు చూసి మీనా బాలు ఇద్దరు కూడా షాక్ అవుతారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటారు. వీడు ఏదో చేస్తున్నాడు మనోజ్ దగ్గరికి వెళ్లి చంప పగలగొడతాడు. ఆ తర్వాత స్పృహలోకి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. ఇక తర్వాత బాలు మీనా సత్యం ముగ్గురు కలిసి రోహిణి గురించి ఎంత నచ్చ చెప్పాలని ప్రయత్నించినా కూడా మనోజ్ వినకపోవడంతో అందరూ షాక్ అవుతారు కానీ ప్రభావతి దగ్గరికి వెళ్లిన సత్యం మాత్రం రోహిణి గురించి ఎంత చెప్పినా సరే తను మాత్రం వినకుండా సీరియస్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్, ప్రేమ ఫైట్.. కన్నీళ్లు తెప్పించే సీన్.. తిరుకు తప్పని తిప్పలు..

Related News

తప్పు మగాడిదైనా.. నింద ఆడదానికేనా? అనసూయ స్ట్రాంగ్ కౌంటర్!

ఆ ఇద్దరూ మరీ అంత వరస్ట్? ఇచ్చిపడేసిన నాగ్!

బిగ్ బాస్ 10.. ఈ వారం కృష్ణుడు ఎలిమినేట్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

మహాభారతం ‘భీముడు’ పై కేస్ ఫైల్.. అసలేం జరిగిందంటే?

Podarillu Chakri : చక్రికీ బంఫర్ ఆఫర్.. ఇది అస్సలు ఊహించిఉండరు..

Podarillu Today Episode : కేశవకు జాగారం.. మాధవ్ కు వార్నింగ్.. నిజం చక్రికీ తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: పార్వతిని చంపేందుకు ప్లాన్.. కిడ్నాపర్స్ ఎంట్రీ.. పల్లవి దొరుకుతుందా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనాపై చింతామణి రివేంజ్.. పాపం..

Big Stories

Advertisement
×