Tamailnadu: అతి వేగం ప్రమాదాలకు దారి తీస్తోంది. స్పీడ్ తగ్గించాలని పోలీసులు పదే పదే చెబుతున్నా వాహనదారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. తాజాగా ఎదురెదుుగా వచ్చిన బస్సు-వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో వ్యాన్ నుజ్జునుజ్జు అయ్యింది. స్పాట్‌లో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం తమిళనాడులో చోటు చేసుకుంది.
తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా మామల్లపురం సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాత ఓఎంఆర్ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న ప్రభుత్వ ఆర్టీసీని వ్యాన్ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో వ్యాన్ ముందు భాగం అంతా నుజ్జు నుజ్జు అయ్యింది. ఘటన సమయంలో రెండు వాహనాల్లో దాదాపు 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు.
పెరుందూరు గ్రామానికి చెందిన సుమారు 20 మంది మహిళలు కేళంబాక్కం సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీకి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పయనూర్ బస్ స్టాండ్ సమీపంలో ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీ కొట్టింది. తెల్లవారుజామున దిగ్భ్రాంతికరమైన ఘటన జరిగింది. వ్యాన్ కేలంబక్కం వైపు వెళ్తుండగా అకస్మాత్తుగా ఓ ఆవు రోడ్డు మీదకు వచ్చింది. దాన్ని తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ వ్యాన్‌పై నియంత్రణ కోల్పోయాడు. అదే సమయంలో తాంబరం నుండి మామల్లపురం వైపు వస్తున్న సిటీ బస్సుని బలంగా ఢీ కొట్టింది.
ALSO READ: షాకింగ్ ఘటన.. భార్యని కుర్చీకి కట్టేసి తగలబెట్టిన భర్త, అసలు మేటర్ అదే!
వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. మరో 17 మంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అంబులెన్సు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలను పక్కకు తొలగించిన ట్రాఫిక్ క్లియర్ చేశారు పోలీసులు. సిటీ బస్సు కూడా బాగానే డ్యామేజ్ అయ్యింది. అందులోనూ పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని సమీపంలోని పూంచేరి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.