Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భవనాలు కూలిన ఘటనలు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా గురువారం మరో భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో రెండు డజన్ల మంది శిథిలాల కింద చిక్కుతున్నారు. ఈ ఘటన గురించి తెలియగానే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. అసలు ఘటన ఎలా జరిగింది?
దేశ రాజధాని ఢిల్లీలో మరో భవనం కూలింది. గురువారం ఉదయం దాదాపు 10 గంటల సమయంలో పాత ఢిల్లీలోని చావ్రి బజార్‌లో నిర్మాణంలో ఉన్న మూడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో స్పాట్‌లో ఇద్దరు మృతి చెందారు. శిధిలాల కింద మరో పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి తెలియగానే సహాయక చర్యల కోసం పోలీసులు, అగ్నిమాపక శాఖకు చెందిన సిబ్బంది రంగంలోకి దిగారు.
ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పిన వివరాల మేరకు.. గురువారం ఉదయం 9. 50 గంటల ప్రాంతంలో భవనం కూలిపోయిందన్నారు. రెండు వాటర్ టెండర్లు, ఒక వాటర్ బౌజర్, ఒక క్విక్ రెస్పాన్స్ వెహికల్, ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ లను సంఘటనా స్థలానికి పంపించారని తెలిపారు. భవనం శిథిలాల కింద ఇంకా చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. మిగతా సిబ్బందిని గుర్తించేందుకు సహాయక బృందాలు ఆ పనిలో నిమగ్నమయ్యాయి.
ALSO READ: కారు పైనుంచి పల్టీలు కొట్టిన కంటైనర్ లారీ.. సినిమా యాక్షన్ సీన్స్ మాదిరిగా, స్పాట్‌లో నలుగురు మృతి
ఇటీవల నైరుతి ఢిల్లీలోని సత్య నికేతన్‌లో సెప్టెంబర్ 6న ఐదు అంతస్తుల పేయింగ్ గెస్ట్ భవనం కూలిపోయి ఏడుగురు మరణించారు. పదుల సంఖ్యలో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన జరిగి దాదాపు రెండు నెలల తర్వాత చావ్రి బజార్ వంతైంది. మరమ్మతు పనులు జరుగుతుండగా భవనం కూలిపోవడంతో ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాజధాని వ్యాప్తంగా నిర్మాణంలో భవనాల భద్రతను నిర్వహించాలని, అనధికారిక-సురక్షితంగా లేని భవనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
కూలిన భవనం ఢిల్లీలోని రద్దీ ప్రాంతాల్లో ఒకటి. నిర్మాణంలో ఉన్న పాత భవనాల భద్రతపై మరోసారి ప్రశ్నలను తలెత్తుతున్నాయి. భారీ భవనాలు, ఇరుకైన సందులు కలిగిన చాందినీ చౌక్ ప్రాంతంలో అత్యవసర సహాయక బృందాలకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. గురువారం జరిగిన ఘటనలో భవనం కూలిపోవడానికి దారితీసిన పరిస్థితులు, భవనం పరిస్థితి ఇంకా నిర్ధారణ కాలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నందున బాధితుల గురించి, లోపల చిక్కుకున్న వారి సంఖ్య గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#दिल्ली के चावड़ी बाजार इलाके में बड़ा हादसा, दमकल गाड़ियां मौके पर मौजूद। यहां तीन मंजिला निर्माणाधीन इमारत का एक हिस्सा अचानक ढह गया। हादसे के बाद इलाके में अफरा-तफरी मच गई। दिल्ली पुलिस के अनुसार, इस दुर्घटना में दो लोगों की मौत हो गई है।
.
.
.#Delhi #ChawriBazar #Collapse pic.twitter.com/f1bkR6A4N2— Journalist Ravendra kumar (@Chhotukingoffi1) November 5, 2026