Dehradun: విధి ఆడిన వింత నాటకంలో ఆ ఫ్యామిలీ బలైంది. అందర్నీ కోల్పోయిన ఆరేళ్ల బాలుడు అనాథగా బయటపడ్డాడు. దారుణమైన రోడ్డు ప్రమాదం ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. దీపావళి షాపింగ్ ముగించుకుని ఓ ఫ్యామిలీ కారులో బయలుదేరింది. ఈ ప్రయాణం చివరి రోజు అవుతుందని అస్సలు ఊహించలేదు. ఆ ఫ్యామిలీ ప్రయాణిస్తున్న కారుపై పల్టీ కొట్టింది కంటైనర్ లారీ. స్పాట్‌లో నలుగురు దుర్మరణం చెందారు. కేవలం ఆరేళ్ల బాలుడు ఈ ప్రమాదం బయటపడ్డాడు.
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నుంచి ఓ దీపావళి షాపింగ్ ముగించుకుని సహారన్‌పూర్‌కు కారులో వెళ్తోంది ఓ ఫ్యామిలీ. డెహ్రాడూన్‌లోని మొహబ్బెవాలా ప్రాంతానికి వచ్చేసరికి యూరియాతో ఓ కంటెనర్ లారీ ఎదురుగా వస్తోంది. అతి వేగంతో వస్తున్న కంటైనర్, తొలుత కారుని ఢీ కొట్టింది. ఆ తర్వాత కారుపై నుంచి పలుమార్లు పల్టీలు కొట్టింది. ఈ ఘటనపై మిశ్రా కపూర్, భార్య నిషా ఆనంద్, తల్లి కిరణ్ కపూర్, నీరజ్‌లు స్పాట్‌లో మరణించారు. కేవలం వారి ఆరేళ్ల బాలుడు మాత్రమే ఈ ఘటన నుంచి బయటపడ్డాడు.
ఈ ప్రమాదానికి కారు నుజ్జునుజ్జు అయ్యింది. తీవ్రంగా గాయపడిన నలుగుర్ని తొలుత కరోనేషన్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అప్పటికే వారంతా మరణించారు. ఈ విషయాన్ని వైద్యులు వెల్లడించారు. మృతుల్లో కారు డ్రైవర్‌తోపాటు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం సుమారు 3.30 గంటల సమయంలో ఐ 20 కారును కంటైనర్ ట్రక్కు బలంగా ఢీ కొట్టింది. ఘటన గురించి అత్యవసర హెల్ప్‌లైన్ ద్వారా పోలీసులకు సమాచారం వచ్చింది.
ALSO READ: ‘తప్పు నంబర్ డయల్ చేశారు.. ధర్నా చేసుకోండి’.. రిజర్వేషన్లపై సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు!
పటేల్ నగర్, క్లెమెంట్ టౌన్ నుండి పోలీసు బృందాలు, అగ్నిమాపక శాఖతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో సహాయక చర్యలు ప్రారంభించాయి. ఘటన సమయంలో కారులో ఐదుగురు ఉన్నారు. చిన్నారిని రక్షించగా మిగిలినవారు ఈ లోకాన్ని విడిచి పెట్టారు. ఈ ప్రమాదం డెహ్రాడూన్ ప్రవేశ ద్వారం వద్ద జరగడంతో రహదారి భద్రతపై ఆందోళనలను రేకెత్తించింది. ఈ ప్రదేశంలో ఇప్పటికే ఎనిమిది ప్రధాన ప్రమాదాలు జరిగాయి. నిషేధించబడిన వేళల్లో భారీ వాహనాలు అధిక వేగంతో నగరంలోకి ప్రవేశిస్తున్నాయని అంటున్నారు స్థానికులు.
A major accident in Dehradun’s Mohabewala area after a heavy container truck overturned onto a car, crushing it completely. Four people inside the car are feared dead.#Dehradun #Uttarakhand #RoadAccident #Trump #america #election2026 pic.twitter.com/T25643mXWe
— Amrita Gupta (@amrita_gupta_00) November 4, 2026
#WATCH | Uttarakhand | Four dead after a speeding container truck loaded with cargo overturned onto a car near Mohabbewala on the Dehradun-Delhi Highway in Dehradun.
Despite eight major accidents having already occurred at this entry point to the capital city, heavy vehicles… pic.twitter.com/eSHEzr6IOD
— ANI (@ANI) November 4, 2026