E-Paper
Advertisement

18 సవర్ల బంగారం.. బిడ్డ, భర్తతో కిడ్నాప్ డ్రామా.. ‘లేడీ డాన్’ ప్లాన్ రివర్స్!

18 సవర్ల బంగారం.. బిడ్డ, భర్తతో కిడ్నాప్ డ్రామా.. ‘లేడీ డాన్’ ప్లాన్ రివర్స్!
Advertisement

Kerala Gold Smuggling: కేరళలోని కరిపూర్ విమానాశ్రయం వెలుపల ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దుబాయిలో దొంగిలించిన బంగారాన్ని భారత్ కు తీసుకొచ్చిన ఓ మహిళ.. దానిని ముఠా సభ్యులకు ఇవ్వకుండా కాజేసే ప్రయత్నం చేసింది. ఎయిర్ పోర్టు బయటకు రాగానే తనను కిడ్నాప్ చేసే విధంగా ముగ్గురు వ్యక్తులను ఏర్పాటు చేసుకుంది. ఈ ప్లాన్ లో తన భర్త, బిడ్డను బలిపశువుగా మార్చింది. చివరికి పోలీసుల ఎంట్రీతో మహిళ ప్లాన్ అడ్డం తిరిగింది.

కేరళలోని తలస్సేరికి చెందిన ప్రియాంక అనే మహిళ దుబాయ్ నుంచి సుమారు 18 సవర్ల బంగారాన్ని అక్రమంగా భారత్‌కు తీసుకొచ్చింది. విమానాశ్రయం వెలుపల వేచి ఉన్న మట్టన్నూర్ వాసి జాబీర్ అనే వ్యక్తికి ఈ బంగారాన్ని ఆమె అందజేయాల్సి ఉంది. అయితే ఆ బంగారాన్ని తానే కొట్టేయాలని పథకం వేసిన ప్రియాంక.. దాన్ని వేరే ముఠాకు తరలించేందుకు ప్లాన్ వేసింది.

Advertisement

తన ప్లాన్ అమల్లో భాగంగా కన్నూర్‌కు చెందిన శ్రీలాల్, ప్రిన్స్, సుబిత్ అనే ముగ్గురు వ్యక్తులతో ప్రియాంక ముందుగానే చేతులు కలిపింది. ముందస్తు ప్లాన్ ప్రకారం తన భర్త, పిల్లలతో విమానాశ్రయం బయటకు వచ్చిన ఆమె.. శ్రీలాల్ బృందం తీసుకువచ్చిన బ్లూ కలర్ మారుతి కారులోకి ఎక్కింది. సొంత కుటుంబాన్ని ఈ క్రైమ్ సీన్ లోకి తెచ్చింది.

ప్రియాంక కారు ఎక్కి వేగంగా వెళ్లిపోవడంతో బంగారం కోసమే వేచి ఉన్న జాబీర్ ఆ కారు వెనకాలే పరుగెత్తడం ప్రారంభించాడు. విమానాశ్రయం వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారి ఇది చూసి నిజంగానే సదరు మహిళను ఎవరో కిడ్నాప్ చేస్తున్నారని భావించి కారును ఛేజ్ చేశారు. దాదాపు 12 కిలోమీటర్ల మేర ఈ ఛేజింగ్ కొనసాగింది. చివరకు పోలీసులు కారును అడ్డుకుని అందరినీ అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Also Read: కపుల్స్ కోసం Airtel బంపరాఫర్.. రూ.749కే అపరిమిత 5G డేటా.. ఓటీటీలు, 2 సిమ్ కార్డ్‌లు!

పోలీసుల విచారణలో అసలు కిడ్నాప్ డ్రామా బయటపడింది. ప్రియాంక స్వయంగా ఈ దొంగతనం నాటకానికి సూత్రధారి అని తేలింది. ఈ వ్యవహారంతో ఆమె భర్తకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన్ను కేవలం ఒక పావుగా వాడుకుందని పోలీసులు స్పష్టం చేశారు. మహిళ ప్లాన్ లో భాగమైన శ్రీలాల్, ప్రిన్స్, సుబిత్ అనే ముగ్గురిపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడైంది. మరోవైపు కారును తరుముతూ పరుగెత్తిన జాబీర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ బంగారం స్మగ్లింగ్ ముఠా వెనుక ఉన్న ఫైనాన్షియర్లు ఎవరు? వారి వెనుక కస్టమ్స్ అధికారుల హస్తం ఏదైనా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

Also Read: ‘రోడ్ల మీద కాదు.. పార్లమెంట్‌లో చూసుకుందాం’.. రాహుల్ సవాల్‌పై అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్!

Tags

Related News

ఐదు ఏనుగులు, రూ.6 కోట్లు.. ఈ ఘటనతో బీజేపీకి లింకేమిటీ?

దేశంలో అశాంతికి కుట్ర.. సీజేపీకి పాక్ నిధులు.. కేంద్రమంత్రి సంచలన ఆరోపణలు!

‘రోడ్ల మీద కాదు.. పార్లమెంట్‌లో చూసుకుందాం’.. రాహుల్ సవాల్‌పై అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్!

ఢిల్లీలో కూలిన మూడు అంతస్థుల భవనం.. స్పాట్‌లో ఇద్దరు మృతి, శిథిలాల కింద మరో రెండు డజన్ల మంది

కారు పైనుంచి పల్టీలు కొట్టిన కంటైనర్ లారీ.. సినిమా యాక్షన్ సీన్స్ మాదిరిగా, స్పాట్‌లో నలుగురు మృతి

‘తప్పు నంబర్ డయల్ చేశారు.. ధర్నా చేసుకోండి’.. రిజర్వేషన్లపై సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు!

టీచర్ గొంతు నులిమి చంపి.. మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టి రోజంతా, సీన్ కట్ చేస్తే.. ప్రిన్సిపాల్ అరెస్టు

Big Stories

Advertisement
×