E-Paper
Advertisement

దేశంలో అశాంతికి కుట్ర.. సీజేపీకి పాక్ నిధులు.. కేంద్రమంత్రి సంచలన ఆరోపణలు!

దేశంలో అశాంతికి కుట్ర.. సీజేపీకి పాక్ నిధులు.. కేంద్రమంత్రి సంచలన ఆరోపణలు!
Advertisement

CJP Foreign Funds: దేశ రాజధానిలో ఇటీవల చోటుచేసుకున్న వరుస పరిణామాలు, నిరసనల వెనుక పెద్ద ఎత్తున కుట్ర దాగి ఉందని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఆందోళనల వెనుక ఉన్న ‘కోక్రోచ్ జనతా పార్టీ’ (CJP – Cockroach Janta Party)కి విదేశాల నుంచి అక్రమంగా నిధులు అందుతున్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బెంగళూరులో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, వ్యూహకర్త అశుతోష్ రంకాలకు విదేశీ శక్తులతో సంబంధాలు ఉన్నట్లు తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. ‘నిషేధిత మూలాలు, దేశంలోనూ, వెలుపల ఉన్న భారత్ వ్యతిరేక ఎన్జీవోల నుంచి వీరికి నిధులు అందుతున్నాయి. అమెరికాలో ఉన్న దాతల నుంచి అభిజీత్ దీప్కే నిధులు పొందుతుండగా.. అశుతోష్ రంకాకు పాకిస్థానీ రాజకీయ నాయకుల నుంచి డబ్బు అందుతోంది’ అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పండగల సీజన్‌లో దేశ రాజధానిలో అశాంతి సృష్టించడానికే ఈ నిధులను వాడుతున్నారని వ్యాఖ్యానించారు.

Advertisement

దీనిపై బీజేపీ జాతీయ ప్రతినిధి తుహిన్ ఎ సిన్హా మాట్లాడుతూ.. పండుగల సీజన్‌లో ఢిల్లీలో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా సీజేపీ నిరసనలు జరిగాయన్నారు. గత నెల రోజులుగా వీరు అరాచకాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారని, దీని వెనుక దుర్బుద్ధి ఉందని ఆరోపించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తీరును కూడా ఆయన తప్పుబట్టారు. కోర్టు విచారణ జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు వెళ్లడం, విచారణకు ముందే మాక్ ఇంపీచ్‌మెంట్ నిర్వహించడం వంటి చర్యలు సరికావని పేర్కొన్నారు. సీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఏకకాలంలో న్యాయవ్యవస్థపై యుద్ధానికి దిగినట్లు కనిపిస్తోందని విమర్శించారు.

Also Read: ‘రోడ్ల మీద కాదు.. పార్లమెంట్‌లో చూసుకుందాం’.. రాహుల్ సవాల్‌పై అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్!

Advertisement

అయితే ఈ విదేశీ నిధుల ఆరోపణలను విపక్ష పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. కేంద్ర హోమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఇంటెలిజెన్స్ బ్యూరో, రా (RAW) సంస్థలు ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నాయని కర్ణాటక హోమంత్రి ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) విమర్శించారు. ఆధారాలు చూపించలేకపోవడం ఆయా సంస్థల అసమర్థతను తెలియజేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.

Also Read: ఆర్టీసీ సంచలన నిర్ణయం.. తలుపులు మూశాకే బస్సు స్టార్ట్.. ప్రవళిక ఘటనతో మేల్కొలుపు!

Tags

Related News

‘రోడ్ల మీద కాదు.. పార్లమెంట్‌లో చూసుకుందాం’.. రాహుల్ సవాల్‌పై అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్!

ఢిల్లీలో కూలిన మూడు అంతస్థుల భవనం.. స్పాట్‌లో ఇద్దరు మృతి, శిథిలాల కింద మరో రెండు డజన్ల మంది

కారు పైనుంచి పల్టీలు కొట్టిన కంటైనర్ లారీ.. సినిమా యాక్షన్ సీన్స్ మాదిరిగా, స్పాట్‌లో నలుగురు మృతి

‘తప్పు నంబర్ డయల్ చేశారు.. ధర్నా చేసుకోండి’.. రిజర్వేషన్లపై సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు!

టీచర్ గొంతు నులిమి చంపి.. మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టి రోజంతా, సీన్ కట్ చేస్తే.. ప్రిన్సిపాల్ అరెస్టు

గృహహింస కేసు పెట్టిన భార్య.. భర్తకు విదేశాల్లో ఉద్యోగావకాశం.. కోర్టు ఏం చెప్పిందంటే

అద్దె విషయంలో గొడవ.. వీధి రౌడీలా రెచ్చిపోయిన వ్యక్తి.. వృద్దుడు, మహిళలపై పిడిగుద్దులు!

Big Stories

Advertisement
×