Thomson 40 Inch Smart TV: ఇంటికి కొత్త కళ తేవాలన్నా..లేదా వీకెండ్‌లో కుటుంబంతో కలిసి సినిమాలు ఎంజాయ్ చేయాలన్నా ఒక మంచి స్మార్ట్ టీవీ కచ్చితంగా ఉండాలి. అయితే.. టీవీ ఎక్కువ ధర పెట్టి కొనలేక పోయే.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు బడ్జెట్ లవర్స్ కోసం ప్రముఖ బ్రాండ్ థామ్సన్ అద్భుతమైన ఫీచర్లతో.. కూడిన టీవీని తీసుకువచ్చింది. అదే థామ్సన్ ఎఫ్ఏ సిరీస్ 40 ఇంచుల ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ. ప్రస్తుతం మార్కెట్లో.. దీని ధర కేవలం రూ.14,999 మాత్రమే ఉండటం విశేషం. ఈ బడ్జెట్‌లో ఈ టీవీ అందిస్తున్న ఫీచర్లు నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ టీవీ మోడల్ ప్రత్యేక ఆకర్షణ దీని బెజెల్-లెస్ డిస్‌ప్లే. స్క్రీన్ చుట్టూ ..అంచులు చాలా సన్నగా ఉండటం వల్ల టీవీ చూడటానికి చాలా ప్రీమియంగా, మోడర్న్‌గా కనిపిస్తుంది. 40అంగుళాల (100 సెం.మీ.)ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే కారణంగా విజువల్స్ చాలా స్పష్టంగా, రంగులతో సహజంగా కనిపిస్తాయి. అలాగే.. ఇందులో ‘స్మార్ట్ షీల్డ్ ఐ’ ప్రొటెక్షన్ టెక్నాలజీ ఉంది. దీని వల్ల ఎక్కువ సేపు టీవీ చూసినప్పటికీ కళ్ళపై.. ఒత్తిడి పడకుండా సురక్షితంగా.. ఉంటుంది. పిల్లలు ఆన్‌లైన్ క్లాసులు లేదా కార్టూన్లు చూసేటప్పుడు ఇది కళ్ళకు ఎంతో రక్షణనిస్తుంది.
స్మార్ట్ టీవీ కొనేటప్పుడు.. సౌండ్ క్వాలిటీ చాలా ముఖ్యం. ఈ థామ్సన్ టీవీలో ఏకంగా 30 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్ అందించే.. 2 పవర్ ఫుల్ స్పీకర్లు ఉన్నాయి. సాధారణంగా.. ఈ బడ్జెట్ రేంజ్ టీవీలలో..20 వాట్స్ సౌండ్ మాత్రమే ఇస్తుంటారు. కానీ థామ్సన్ ఇందులో.. పవర్ ఫుల్ స్పీకర్‌లను ఇవ్వడం ద్వారా ఎలాంటి ఎక్స్‌టర్నల్ హోమ్ థియేటర్ అవసరం లేకుండానే..రూమ్ మొత్తం హోరెత్తించే ఆడియో ఫీల్ ఇస్తుంది. ఫలితంగా సినిమాలు చూసేటప్పుడు..లేదా పాటలు వినేటప్పుడు థియేటర్ ఫీల్ కలుగుతుంది.
టీవీ ఎంత స్మూత్‌గా పని చేస్తుంది అనేది దాని ప్రాసెసర్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ టీవీలో పవర్ ఫుల్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ ను వాడారు. దీని వల్ల యాప్స్ ఓపెన్ చేయడం, యూట్యూబ్, నెట్ ఫ్లిక్స్,ప్రైమ్ వీడియో ..వంటి ఓటీటీ ప్లాట్ ఫారమ్‌లను ల్యాగ్ లేకుండా.. చాలా వేగంగా రన్ చేయెచ్చు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై.. పని చేసే ఈ టీవీ యూజర్ ఇంటర్‌ఫేస్ చాలా ఈజీగా ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉండటం.. వల్ల వాయిస్ కమాండ్స్ ద్వారా కూడా టీవీని ఆపరేట్ చేయెచ్చు.
Also Read: శాంసంగ్ ట్యాబ్‌లపై భారీ డిస్కౌంట్‌లు..అస్సలు మిస్సవ్వొద్దు
ప్రస్తుతం కేబుల్ కనెక్షన్‌లతో.. పాటు ఓటీటీల హవా నడుస్తోంది.ఈ థామ్సన్ టీవీ ప్రత్యేకత ఏంటంటే..ఇందులో ఎలాంటి.. సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఏకంగా 600+ పైగా ఫ్రీ లైవ్ ఛానెల్స్ లభిస్తాయి.ఎంటర్ టైన్మెంట్, వినోదం, పిల్లల ప్రోగ్రామ్‌లు ఇలా వివిధ.. కేటగిరీలకు చెందిన ఛానెళ్లను ఉచితంగా చూడొచ్చు. ఇది కస్టమర్లకు మరింత డబ్బు ఆదా చేస్తుంది.
ఎక్స్‌టర్నల్ డివైస్‌ను కనెక్ట్ చేయడానికి ఇందులో తగినన్ని హెచ్‌డీఎంఐ , యూఎస్‌బీ పోర్టులు, వైఫై ఆప్షన్లు ఉన్నాయి. ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్ లేదా గేమింగ్ కన్సోల్‌లను ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు.
కేవలం రూ.14,999 బడ్జెట్‌లో.. 40 ఇంచుల బిగ్ స్క్రీన్, 30 వాట్స్ సౌండ్, ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే , స్మార్ట్ ఆండ్రాయిడ్ ఫీచర్లు కోరుకునే వారికి.. ఈ మోడల్ ఒక పర్ఫెక్ట్, వాల్యూ ఫర్ మనీ ఛాయిస్ అని చెప్పొచ్చు. మీరు కూడా బడ్జెట్ ధరలో మంచి టీవీ కొనాలని చూస్తుంటే.. దీనిని నిరభ్యంతరంగా కొనొచ్చు!