CCI investigation finds Amazon.. Walmart..s Flipkart breached anti trust laws: భారత్ లో ఈ కామర్స్ వ్యాపార దిగ్గజాలు ఎవరంటే అమెజాన్, ఫ్లిప్ కార్డ్ అని చెబుతారంతా. రీసెంట్ గా వాల్ మార్ట్ ను సైతం ఫ్లిప్ కార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దేశంలోనే ఆన్ లైన్ షాపింగ్ వెబెసైట్లలో వినియోగదారులను ఆకర్షిస్తూ ఒకదానిపై మరొకటి పోటీపడుతున్నాయి. అయితే ఆసియాలోనే అత్యంత కుబేరుడైన ముకేష్ అంబానీ త్వరలోనే రిటైల్ ఆన్ లైన్ మార్కెట్లో సంచలనాలను నమోదు చేయడానికి సిద్ధమయ్యారు. గత ఏడాది ఆన్ లైన్ విక్రయాల మార్కెట్ 85 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారత్ లెక్కల ప్రకారం సుమారు రూ.ఐదు లక్షల తొంభై వేల కోట్లు. రానున్న మూడేళ్లలో ఇది మరింత ఎక్కువగా 25 శాతం వృద్ధిని సాధిస్తుందని మార్కెట్ నిపుణుల అంచనా.
చట్టాలను అతిక్రమించాయి
కరోనా సంక్షోభం తర్వాత ఆన్ లైన్ అమ్మకాలు డబుల్ అయ్యాయి. ఇంటి వద్దకే కావలసిన వస్తువులు సమకూరడంతో అందరూ ఆన్ లైన్ షాపింగ్ లపై ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. అయితే ఈ ఆన్ లైన్ పోటీలో ఒక కంపెనీ మరొక కంపెనీతో పోటీ పడటం సహజమే. కానీ అవి పోటీ చట్టాలను అతిక్రమిస్తున్నాయి. ఒకదానిని మరొకటి అధిగమించాలనే ఆత్రుతతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ దిగ్గజాలు పోటీ చట్టాలను అతిక్రమించాయని భారత్ కు చెందిన యాంటీ ట్రస్ట్ దర్యాప్తులో తేలింది. దీనిపై కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణకు ఆదేశించింది. అమెజాన్, ఫ్లిప్ కార్డులు తమ పార్టనర్స్ గా ఉన్న కంపెనీలకు ఎక్కువగా ప్రాధాన్యత నిస్తూ ప్రమోషన్ పేరుతో చట్టాలను అతిక్రమించారని సీసీఐ విచారణకు ఆదేశించింది. దీనిపై అమెజాన్ కంపెనీపై 1027, ఫ్లిప్ కార్డుపై 1696 పేజీల నివేదిక రెడీ చేశారు. ఈ రెండు కంపెనీలు ఉద్దేశపూర్వకంగానే తమకు నచ్చిన కంపెనీలతోనే డీల్ జరిపాయని తేలింది. అయితే సీసీఐ నివేదికను ఇంకా బయటపెట్టలేదు.
Also Read: భూములపై మైక్రోసాఫ్ట్ దృష్టి.. పూణె, హైదరాబాద్ నగరాల్లో..
సీసీఐ స్పందించాలి
దీనిపై సీసీఐ స్పందించాలని రాయిటర్స్ కోరింది. అయితే తాము భారత చట్టాలను ఏ మాత్రం అతిక్రమించలేదని.. తమకు భారత ప్రభుత్వ పై అపార గౌరవం ఉందని.. అందుచేత కంపెనీ నిబంధనలు ఏనాడూ తాము అతిక్రమించలేదని అమెజాన్, ఫ్లిప్ కార్డులు తమపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇస్తున్నాయి. ఇప్పటికీ తాము భారతీయ చట్టాలను గౌరవిస్తున్నామని అంటున్నాయి.