Youth Catches Cops: సాధారణ పౌరుడైనా, ప్రభుత్వాధికారైనా, రాజకీయ నాయుకుడైనా చట్టాలను ఫాలో కావాల్సిందే. సామాన్యుల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పోలీసు అధికారులు చెబుతుంటారు. అదే వారు చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరు నిలదీస్తారు?. ఇందుకు ఓ యువకుడు సమాధానంగా నిలిచాడు. ‘చట్టం అందరికీ సమానమే’ అనే నానుడి రుజువు చేస్తూ ఓ యువకుడు చేసిన పనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..
మహారాష్ట్రలో థానేలోని అంబికా నగర్లో జరిగిన ఘటనలో ఓ యువకుడు హెల్మెట్ ధరించనందుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. అయితే, పోలీసులు అక్కడి నుంచి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, వారు నడుపుతున్న స్కూటర్‌కు నంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడాన్ని ఆ యువకుడు గమనించాడు. ఇంతలో ఆ యువకుడు వారిని వెంబడించి బండిని ఆపాడు. మొత్తం ఘటనను వీడియో తీయడం ప్రారంభించాడు. “మీరు నిబంధనలు పాటించకుండా, మీ బండికే సరైన నంబర్ ప్లేట్ లేకుండా మాకు ఎలా చలాన్లు వేస్తారు?” అని పోలీసులను నిలదీశాడు.
READ ALSO: Viral Video: వైజాగ్‌లో భారీ కొండచిలువ.. 12 అడుగుల పామును చూసి జనం బెంబేలు!
ఈ పరిణామంతో కంగుతున్న పోలీసులు, ఆ స్కూటర్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్తున్నామని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, ఆ స్కూటర్‌పై ‘పోలీస్‘ స్టిక్కర్ కూడా ఉన్నట్లు వీడియోలో కన్పిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులే నిబంధనలు పాటిస్తున్నారా? అని నెటిజన్లు నిలదీస్తున్నారు. చలాన్లు వేసే ముందు, పోలీసులు మొదట నిబంధనలు పాటించి ప్రజలకు ఆదర్శంగా ఉండాలని, చట్టం అందరికీ సమానంగా వర్తించాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
🚨LAW SHOULD BE EQUAL FOR EVERYONE IN THE COUNTRY⁉️
A video is going viral on social media,the Incident is Ambika Nagar, Thane, Maharashtra, where the Traffic police issued a challan to a young man for not wearing a helmet.
And when Traffic Police started to leave, the young… https://t.co/4oHeWro3SA pic.twitter.com/JuOg6VxBG5
— Bhakt Prahlad🚩 (@RakeshKishore_l) October 28, 2025